ప్రముఖ స్టార్‌ క్రికెటర్ హార్థిక్‌ పాండ్యా(Hardik Pandya) తన భార్య నటాషాతో(Natasha) విడాకులు తీసుకున్నాడు.

ప్రముఖ స్టార్‌ క్రికెటర్ హార్థిక్‌ పాండ్యా(Hardik Pandya) తన భార్య నటాషాతో(Natasha) విడాకులు తీసుకున్నాడు. ఈ మేరకు తాము విడిపోయినట్లు ఇద్దరూ ఒకరినొకరు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ఇది చాలా ఇబ్బందికర నిర్ణయమైనప్పటికీ ఇద్దరి ప్రయోజనాల మేరకు విడిపోవాల్సి వస్తుందని తెలిపారు. తాము విడిపోయినా తమ కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామని తెలిపారు. నాలుగేళ్లు కలిసి ఉన్నా తర్వాత పరస్పరం విడిపోవడానికి నిర్ణయించుకున్నామని చెప్పారు. కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నించినా ఫలితం రాలేదన్నారు. తాము కలిసి గడిపిన సమయం, పరస్పర గౌరవం, కుటుంబంగా ఎదగడానికి ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. కానీ తమ కొడుకు అగస్త్యకు(agastya) మాత్రం కో పేరెంట్స్‌గా(co-parenting) ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని అన్నారు. తమ కొడుకు హ్యాపీనెస్‌ కోసం ఏదైనా చేస్తామని అన్నారు.

అయితే వీరి విడాకులపై గత ఐపీఎల్‌(IPL) సీజన్‌ సందర్భంగానే వార్తలు వచ్చాయి. ప్రతీ ఐపీఎల్‌లో హార్థిక్‌కు మద్దతుగా నటాషా వచ్చి ఎంకరేజ్‌ చేసేది. కానీ గత ఐపీఎల్‌ సీజన్‌లలో ఎక్కడా నటాషా కనిపించలేదు. నటాషా పుట్టినరోజైన మార్చి 4న కూడా హార్థిక్ పాండ్యా ఎక్కడా విష్‌ చేయలేదు. అంతే కాకుండా నటాషా తన ఇన్‌స్ట్రాగ్రాం ఖాతా నుంచి పాండ్యా అనే ఇంటి పేరును తొలించడంతో ఈ వార్తలకు ఇంకా బలం చేకూరింది. అయితే విడాకులకు సరైన కారణాలు మాత్రం తెలియరాలేదు. అలెగ్జాండర్ అలెక్సిలిక్(Alexander Alexylik) అనే వ్యక్తితో ఈ మధ్య నటాషా చనువుగా ఉంటుందన్న కారణం కూడా విడాకులకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో ఓ సారి అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో కలిసి వెళ్తున్న సందర్భం మీడియా కంటపడింది. ఈ ఇద్దరు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్‌లో రూమర్ నడుస్తోంది.

17 ఏళ్ల వయస్సులో నటాషా మోడలింగ్ ప్రారంభించింది. 2013లో ప్రకాష్ ఝా చిత్రం ‘సత్యాగ్రహ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నటాషా 2014 సంవత్సరంలో ‘బిగ్ బాస్ 8’లో కూడా కనిపించింది. 2018లో బాద్‌షా సూపర్‌హిట్ పాట ‘డీజే వాలే బాబు’లో నటాషా కూడా నటిగా కనిపించింది. ‘ఫుక్రే రిటర్న్స్’ ‘జీరో’ వంటి చిత్రాలలో నటాషా కూడా పనిచేసింది.

2016లో వన్ డేలలో హార్థిక్ పాండ్యా అరంగేట్రం చేశాడు. అన్ని ఫార్మాట్లో కీలక ఆటగాడిగా మారాడు. పాకిస్థాన్‌తో 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. 2017లో శ్రీలంకతో టెస్ట్ అరంగేట్రం చేసాడు. 2017లో ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. 2018 ఐపీఎల్ కోసం 12 కోట్లు వెచ్చించింది. 2018 ఐపీఎల్ లో 18 వికెట్లు తీసి కీలక ఆటగాడిగా మారాడు. ఏప్రిల్ 2024లో, హార్దిక్ పాండ్యా 2024 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసి భారత్‌కు ప్రపంచ కప్‌ అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు హార్థిక్ పాండ్యా.

Eha Tv

Eha Tv

Next Story