భారతీయ మహిళలు నేడు అనంతమైన అంతరిక్ష విస్తృతిని కూడా సవాల్ చేస్తున్నారని ప్రశంసించారు. ఏ దేశంలోని మహిళలైనా అంతటి ఆకాంక్షలతో పని చేస్తూ ఉంటే, అభివృద్ధి చెందిన దేశంగా ఆ దేశం ఎదగకుండా ఎవరు ఆపగలరని ప్రశ్నించారు. ‘‘చంద్రయాన్-3 విజయం ఎంత గొప్పది అంటే, దాని గురించి ఎంత ఎక్కువగా చర్చించినా తక్కువే అవుతుంది. ప్రతి ఒక్కరూ కృషి చేసినపుడు, విజయం సాధించవచ్చు. ఇదే చంద్రయాన్-3 సాధించిన అతి గొప్ప విజయం’’ అన్నారు. నవ భారతం స్ఫూర్తికి చిహ్నంగా మిషన్ చంద్రయాన్ మారిందన్నారు.

భారత్‌ విజయానికి ప్రతీక చంద్రయాన్‌-3

ప్రధాని తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష

చంద్రయాన్-3లో మహిళా శాస్త్రవేత్తల పాత్ర ప్రశంసనీయం

విజయంలో మహిళల పాత్రను 'మన్ కీ బాత్’లో ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోడీ

చంద్రయాన్-3(chandrayaan-3) కార్యక్రమం విజయవంతమవడం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రతి వేదికపైనా ఘనంగా చెప్తున్నారు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంటున్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆయన నిర్వహించే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో(Mann Ki bath) కూడా దీనిని ప్రస్తావించారు. ఈ విజయంలో మహిళా శాస్త్రవేత్తల(female scientists) పాత్రను కీర్తించారు. ఈ నెల 23న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్(Vikram Lander) చంద్రునిపై ‘శివశక్తి’ స్థానం వద్ద దిగింది. చంద్రుని దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టిన మొదటి దేశంగా మన దేశం ఘనత సాధించింది. ఈ విజయానికి కారకులైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలను అభినందించేందుకు మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన ముగించుకుని, నేరుగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ‘మన్ కీ బాత్’లో నరేంద్ర మోడీ మాట్లాడుతూ, చంద్రయాన్-3 విజయవంతమవడం మహిళా శక్తికి సజీవ ఉదాహరణ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు.

భారతీయ మహిళలు నేడు అనంతమైన అంతరిక్ష విస్తృతిని కూడా సవాల్ చేస్తున్నారని ప్రశంసించారు. ఏ దేశంలోని మహిళలైనా అంతటి ఆకాంక్షలతో పని చేస్తూ ఉంటే, అభివృద్ధి చెందిన దేశంగా ఆ దేశం ఎదగకుండా ఎవరు ఆపగలరని ప్రశ్నించారు. ‘‘చంద్రయాన్-3 విజయం ఎంత గొప్పది అంటే, దాని గురించి ఎంత ఎక్కువగా చర్చించినా తక్కువే అవుతుంది. ప్రతి ఒక్కరూ కృషి చేసినపుడు, విజయం సాధించవచ్చు. ఇదే చంద్రయాన్-3 సాధించిన అతి గొప్ప విజయం’’ అన్నారు. నవ భారతం స్ఫూర్తికి చిహ్నంగా మిషన్ చంద్రయాన్ మారిందన్నారు. అన్ని రకాల పరిస్థితుల్లోనూ గెలవాలని ఆకాంక్షించేది నవ భారతమని తెలిపారు. ఏ పరిస్థితిలోనైనా విజయం సాధించడం ఎలాగో తెలిసినది నవ భారతమని చెప్పారు. నారీశక్తి సామర్థ్యం కూడా తోడైతే, అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం అవుతుందన్నారు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు సున్నితంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగింది. విక్రమ్ ల్యాండర్ సున్నితంగా దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేశారు. చంద్రయాన్-2 దిగిన ప్రదేశానికి తిరంగా అని నామకరణం చేశారు.

భారత్‌ విజయానికి ప్రతీక చంద్రయాన్‌-3: చంద్రయాన్‌-3 భారత్‌ విజయానికి ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మన్‌కీ బాత్‌ 104వ ఎపిసోడ్‌లో మాట్లాడారు. దేశంలోని పురాతనమైన భాషల్లో తెలుగు ఒకటని పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందన్నారు. భారత్‌ వచ్చే నెల దిల్లీలో జీ 20 సమావేశాలకు సిద్ధమవుతోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధిలు హాజరుకానున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్‌ ఈ స్థాయి జీ-20లో భాగస్వామి అవుతోందని, గ్రూపును మరింత కలుపుగోలుగా చేస్తోందని చెప్పారు. జీ-20కి భారత్‌ నేతృత్వం అంటే ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్లు భావించాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

భారత్‌ జీ-20 అధ్యక్షత బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి గర్వించదగిన పరిణామాలు చాలా చోటు చేసుకొన్నాయి. ఇప్పటి వరకు ఈ సదస్సులు జరిగిన నగరాల్లో ప్రజలు విదేశీ అతిథులను సాదరంగా ఆహ్వానించారు. భారత్‌లోని వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూసి విదేశీ అతిథులు చాలా ప్రభావితమయ్యారు. భారత్‌కు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని వారు తెలుసుకొన్నారు. జీ-20 సదస్సు శ్రీనగర్‌లో జరిగిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.

తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష : నేడు భారత్‌ క్రీడల్లో నిలకడగా విజయాలు సాధిస్తోంది. తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో రికార్డు స్థాయిలో మనవాళ్లు పతకాలు సాధించారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు దాదాపు 10 కోట్ల మంది జాతీయ పతాకంతో సెల్ఫీ దిగారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ‘సంస్కృత భారతీ’ ఆధ్వర్యంలో ‘సంస్కృతంలో మాట్లాడే క్యాంప్‌’ నిర్వహిస్తారు. ప్రజలకు ఈ భాషను బోధించడంలో భాగంగా జరిగే క్యాంపులో మీరూ పాల్గొనవచ్చు. అంతేకాదు. తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం.

నిదానమే ప్రజ్ఞానం : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘మేరీ మాటి..మేరీ దేశ్‌’ కార్యక్రమం జోరుగా జరుగుతోంది. సెప్టెంబర్‌ నెలలో దేశ వ్యాప్తంగా ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం నుంచి మట్టి నమూనా సేకరించే కార్యక్రమం ఉద్యమ స్థాయిలో జరుగుతుంది’’ అని ప్రధాని నరేంద్ర మోడీ మన్‌కీ బాత్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో పాల్గొన్న అమ్లాన్‌, ప్రగతి, ప్రియాంక తదితరులతో ముచ్చటించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకొన్నారు.

Updated On 27 Aug 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story