అయోధ్య(Ayodhya) నగరంలో కొత్త విమానాశ్రయం(Airport) వెలిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narednra modi) ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీనికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం(VAlmiki International Airport) అయోధ్య ధామ్‌ అని పేరు పెట్టారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ దేశంలోని మూడు ముఖ్యమైన నగరాల నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడుపనుంది.

అయోధ్య(Ayodhya) నగరంలో కొత్త విమానాశ్రయం(Airport) వెలిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narednra modi) ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీనికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం(VAlmiki International Airport) అయోధ్య ధామ్‌ అని పేరు పెట్టారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ దేశంలోని మూడు ముఖ్యమైన నగరాల నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడుపనుంది. వచ్చే ఏడాది జనవర్‌ 17 నుంచి బెంగళూర్‌ నుంచి అయోధ్యకు నేరుగా, కోల్‌కతా నుంచి అయోధ్యకు డైరెక్ట్‌గా విమానాలు నడపనున్నట్లు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రకటించింది. అలాగే జనవరి 30, 2024 నుంచి ఢిల్లీ నుంచి అయోధ్యకు డైరెక్ట్‌ విమానం నడపనుంది. బెంగళూరు-అయోధ్య మధ్య జనవరి 17, 2024న ఉదయం 8.05 గంటలకు మొదటి ఫ్లైట్‌ నడుస్తుంది. ఇది ఉదయం 10.35 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. అయోధ్య నుంచి మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.10 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. అయోధ్య నుంచి తొలి విమానం జనవరి 17, 2024 ఉదయం 11.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కోల్‌కతాకు చేరుకుంటుంది. కోల్‌కతా నుంచి రోజూ 1.25 నిమిషాలకు బయలుదేరి 3.10 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. ఇదిలా ఉంటే ఇండిగో జనవరి 11, 2024 నుండి అహ్మదాబాద్ – అయోధ్య మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది.

Updated On 30 Dec 2023 5:44 AM GMT
Ehatv

Ehatv

Next Story