కర్ణాటకలో(Karnataka) కాంగ్రెస్‌(congress) ఘన విజయం సాధించింది. గెలుపు ఆశలు పెట్టుకున్న బీజేపీకి(BJP) నిరాశే మిగిలింది. నిజానికి ఈ ఓటమి ఎవరి ఖాతలో పడాలి? ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendhra Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలు(Amith shah) ఓటమికి బాధ్యత వహించకూడదా? ఈ సందేహం ప్రజల మెదళ్లోకి రాకముందే వాట్సప్‌ యూనివర్సిటీ అప్రమత్తమయ్యింది. నిత్యం అసత్యాలను ప్రచారం చేసే ఆ వాట్సప్‌ యూనివర్సిటీ మోదీషాలపై ఈగ వాలనివ్వడం లేదు.

కర్ణాటకలో(Karnataka) కాంగ్రెస్‌(congress) ఘన విజయం సాధించింది. గెలుపు ఆశలు పెట్టుకున్న బీజేపీకి(BJP) నిరాశే మిగిలింది. నిజానికి ఈ ఓటమి ఎవరి ఖాతలో పడాలి? ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendhra Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలు(Amith shah) ఓటమికి బాధ్యత వహించకూడదా? ఈ సందేహం ప్రజల మెదళ్లోకి రాకముందే వాట్సప్‌ యూనివర్సిటీ అప్రమత్తమయ్యింది. నిత్యం అసత్యాలను ప్రచారం చేసే ఆ వాట్సప్‌ యూనివర్సిటీ మోదీషాలపై ఈగ వాలనివ్వడం లేదు. ఊహించినట్టుగానే ఓటమిని బొమ్మై ఖాతాలో వేసేశారు భక్తులు. నిజం చెప్పాలంటే కర్ణాటకకు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నా , పాలన అంతా ఢిల్లీ నుంచే జరిగింది. కాంగ్రెస్‌(Congress)-జేడీఎస్‌(JDS) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడంలో ఢిల్లీ పెద్దలు ప్రమేయం లేదని ఎలా చెప్పగలం? కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌)ల మధ్య తగవులు పెట్టడంలో కర్ణాటక బీజేపీ నేతలు చేసిన ప్రయత్నం ఫలించింది. ఎలాగైతేనేం ఆ ప్రయత్నం ఫలించింది.

యడియూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తనకు నచ్చినవారిని మంత్రివర్గంలో తీసుకున్నారు. అలా క్యాబినెట్‌లో చోటు సంపాదించుకున్నవారిలో అసెంబ్లీలో నిసిగ్గుగా పోర్న్‌ ఫిల్మ్‌లు చూసినవారు కూడా ఉండటం గమనార్హం. ఇక అప్పట్నుంచే కర్ణాటకను ఢిల్లీ పెద్దలు పాలించడం మొదలు పెట్టారు. దాంతో యడియూరప్ప మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేయలేకపోయారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా మోదీ షాలు కనికరించలేదు. పాపం మొదట ప్రమాణం మంత్రులతోనే నెట్టుకొచ్చారు యడియూరప్ప. ముఖ్యమంత్రిగా ఉన్న రెండేళ్ల పాటు యడియూరప్పకు ఇదే అవస్థను చవిచూశారు. యడియూరప్ప పాలన సరిగ్గా లేదని చెబుతూ ఆయనను సీఎం సీటు నుంచి తప్పించింది అధిష్టానం. యడియూరప్పకు ఏ మాత్రం స్వేచ్ఛనివ్వకుండా, ప్రతీది ఢిల్లీ నుంచే కానిచ్చిన బీజేపీ పెద్దలు ఆయనపై అవినీతి ముద్రను ఎలా వేశారో ఇప్పటికీ అర్థం కాదు. యడియూరప్పను ఓ బలిపశువును చేశారన్నమాట! ఆయన తర్వాత బొమ్మైని సీఎం పదవిలో కూర్చొపెట్టింది. పాపం బొమ్మైది కూడా ఇదే పరిస్థితి.

యడియూరప్ప కంటే ఎక్కువసార్లే ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చారు. తన అధికార కార్యక్రమాలను రద్దు చేసుకుని అర్జెంట్‌గా ఢిల్లీకి వెళ్లి సందర్భాలు కోకొల్లలు. ఢిల్లీ పెద్దల ఆదేశాలను పాటిస్తూ, వారు చెప్పినట్టుగానే బొమ్మై కర్ణాటకను పాలించారు. ఆరేడు నెలల నుంచి కర్ణాటకను పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు ఢిల్లీ పెద్దలు. ఎన్నికల్లో ఎవరెవరు ప్రచారం చేయాలి? ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి? ఏఏ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలి? ఎవరిని తప్పించాలి? ..ఇలాంటివన్నీ ఢిల్లీ పెద్దలే చూసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక కమిటీలో యడియూరప్ప ఉన్నా ఆయన అభిప్రాయాలను బేఖాతరు చేశారు. చాలా మంది సిట్టింగులను పక్కన పెట్టేశారు. కొత్తవారిని తెరపైకి తెచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కర్ణాటక రాజకీయం మొత్తం మోదీ, షా చేతుల్లోకి వెళ్లింది. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం అభ్యర్థుల ఎంపికలో వేలు పెట్టలేదు. మొత్తం సిద్ధరామయ్య- డీకే శివకుమార్‌లే చూసుకున్నారు. ఇక బీజేపీ ప్రచార బాధ్యతను కూడా మోదీనే మోశారు. రోడ్‌ షోలు, ర్యాలీలు, సభలలో మోదీ పాల్గొన్నారు. అమిత్ షా కూడా విపరీతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు బీజేపీ ఓడిపోవడంతో బీజేపీ పరాజయానికి మోదీ, అమిత్ షా ఎలా బాధ్యులవుతారు అంటూ వాట్సప్‌ యూనివర్సిటీ ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఓట‌మి బాధ్యతను బొమ్మైపైకి నెట్టేసింది. పాపం బొమ్మై...!

Updated On 16 May 2023 2:34 AM GMT
Ehatv

Ehatv

Next Story