నక్సల్స్‌ను(Naxals) ఎదుర్కొవడానికి, వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడానికి సుమారు మూడున్నర దశాబ్దాల కిందట ఆవిర్భవించిన గ్రేహౌండ్స్‌ను(Greyhounds) తీర్చిదిద్దిన నారాయణ్‌సింగ్‌ భాటీ(Narayana Singh Bhati) కన్నుమూసిన సంగతి తెలిసిందే. 94 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటూ మంగళవారం తుదిశ్వాస విడిచారు భాటి. రాజేంద్రనగర్‌లోని(Rajendra Nagar) ప్రేమావతి పేట్‌ గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రంలోనే ఆయన కన్నుమూయడం గమనార్హం. భాటికి భార్య, కుమారుడు ఉన్నారు. భాటి కొడుకు కూడా గ్రేహౌండ్స్‌ దళాలకు జంగిల్‌ వార్‌ఫేర్‌లో ట్రైనింగ్‌ ఇస్తున్నారు.

నక్సల్స్‌ను(Naxals) ఎదుర్కొవడానికి, వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడానికి సుమారు మూడున్నర దశాబ్దాల కిందట ఆవిర్భవించిన గ్రేహౌండ్స్‌ను(Greyhounds) తీర్చిదిద్దిన నారాయణ్‌సింగ్‌ భాటీ(Narayana Singh Bhati) కన్నుమూసిన సంగతి తెలిసిందే. 94 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటూ మంగళవారం తుదిశ్వాస విడిచారు భాటి. రాజేంద్రనగర్‌లోని(Rajendra Nagar) ప్రేమావతి పేట్‌ గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రంలోనే ఆయన కన్నుమూయడం గమనార్హం. భాటికి భార్య, కుమారుడు ఉన్నారు. భాటి కొడుకు కూడా గ్రేహౌండ్స్‌ దళాలకు జంగిల్‌ వార్‌ఫేర్‌లో ట్రైనింగ్‌ ఇస్తున్నారు. అటవీ యుద్ధతంత్రంలో ఆరితేరిన కమాండో విభాగంగా గ్రేహౌండ్స్‌ను తీర్చిదిద్దిన ఆయనను కానిస్టేబుల్‌ మొదలుకొని ఐపీఎస్‌లు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారులు ద్రోణాచార్యుడిగా గౌరవిస్తారు. అభిమానిస్తారు. ఆయన సేవలకుగాను కేంద్రప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

ఎన్‌.టి.రామారావు(N.T.R) ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నక్సలిజం(Naxalism) ఎక్కువగా ఉండింది.. అడవుల్లో ఉంటూ ఆకస్మాత్తుగా విరుచుకుపడుతున్న నక్సలైట్లను(Naxalites) ఎదుర్కోవడం పోలీసులకు సాధ్యం కాకుండా ఉండింది. నక్సల్స్‌ దాడిలో ఎంతో మంది పోలీసులు అమరులయ్యారు. నక్సలిజంను రూపుమాపడటమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసు డిపార్ట్‌మెంట్‌ కూడా అనేక ప్రయోగాలు చేసింది. సీఆర్‌పీఎఫ్‌(CRPF), బీఎస్‌ఎఫ్‌తో(BSF) పాటు పంజాబ్‌ కమాండోలను కూడా రంగంలోకి దింపింది.

ఈ ప్రయోగం కూడా విఫలమయ్యింది. అందుకు కారణం ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, భాషా సంస్కృతులు వారికి తెలియకపోవడమే! ఇలాగైతే కష్టమేనని భావించిన అప్పటి ఐపీఎస్‌(IPS) అధికారి కె.ఎస్‌.వ్యాస్(K.S Vyas) అటవీ యుద్ధతంత్రంలో సిబ్బందిని తీర్చిదిద్దాలనుకున్నారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కూడా ఇందుకు అంగీకారం తెలిపారు. గ్రేహౌండ్స్‌(Greyhounds) పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గ్రే హౌండ్స్‌ అయితే అంకురించింది. మరి దానికి శిక్షణ ఎలా? ఎవరు ఇవ్వాలి? అన్న ఆలోచన మొదలయ్యింది. అప్పుడు నారాయణ్‌సింగ్‌ భాటి గుర్తుకొచ్చారు. సశస్త్ర సీమా బల్‌-ఎస్‌ఎస్‌బిలో డీఐజీగా పనిచేసి పదవీ విరమణ చేసిన భాటి అయితే బాగుంటుందని నిర్ణయించి ఆయనను ఎంపిక చేశారు. ఆ విధంగా రాజస్థాన్‌లోని(Rajasthan) జోధ్‌పుర్‌కు(Jodhpur) చెందిన భాటి 1989లో గ్రే హౌండ్స్‌ కన్సల్టెంట్‌గా నియమితులయ్యారు.

నార్సింగి సమీపంలోని ప్రేమావతిపేటలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 200 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు. అక్కడే గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటయ్యింది. అడవుల్లో ఎదురయ్యే అన్ని రకాల భౌగోళిక పరిస్థితులను ఇక్కడ పునఃసృష్టించారు భాటి. సిబ్బందికి ట్రైనింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమయ్యింది. నక్సల్స్‌కు తీవ్ర నష్టం వాటిల్లసాగింది. మరోవైపు పోలీసుల వైపు నుంచి ప్రాణనష్టం తగ్గింది. ప్రభుత్వం కోరుకున్నది కూడా ఇదే! క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చేవారు.

జంగిల్‌ వార్‌ఫేర్‌లో గ్రేహౌండ్స్‌ రాటుదేలిపోయింది. ముఖ్యంగా గెరిల్లా యుద్ధతంత్రాలలో గ్రేహౌండ్స్‌ బలగాలకు భాటి ఇచ్చిన స్పెషల్‌ ట్రైనింగ్‌ సిబ్బందిని రాటుదేలేలా చేసింది. ఒక్కో గ్రేహౌండ్స్‌ పోలీసు... తుపాకీ తూటాలా.. చిరుతలా తయారవ్వాలి అని భాటి అనేవారు. ప్రత్యర్థుల వైపు నుంచి తూటాలు తమవైపుకు దూసుకువస్తున్నా .. ఆత్మవిశ్వాసం సడలకుండా, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగేలా సిబ్బందిని తయారుచేశారు భాటి. పోలీసు శాఖలో పనిచేస్తున్న మెరికల్లాంటి యువతను గ్రేహౌండ్స్‌లో డిప్యూటేషన్‌ మీద రిక్రూట్ చేసుకునేవారు. ఆరు నెలల్లోనే వారిని అద్భుతంగా తీర్చిదిద్దేవారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆవిర్భవించిన గ్రేహౌండ్స్‌ తదనంతర కాలంలో మిగతా రాష్ట్రాలకు ప్రేరణగా నిలిచింది. బీహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఢ్, ఒడిశా, మహారాష్ట్రలలో కూడా నక్సల్స్‌ సమస్య ఉండింది. ఆయా రాష్ట్రాల పోలీసు శాఖలు గ్రేహౌండ్స్‌ తరహా విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. కేంద్ర బలగమైన సీఆర్‌పీఎఫ్‌లో కూడా కోబ్రా పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీటికి ట్రైనింగ్‌ ఇక్కడున్న గ్రేహౌండ్స్‌లోనే ఇచ్చేవారు.
భాటి మృతిపట్ల పోలీసు విభాగానికి చెందిన చాలా మంది అధికారులు నివాళి అర్పించారు. డీజీపీ అంజనీకుమార్‌ అయితే భావోద్వేగానికి లోనయ్యారు. తాను గ్రేహౌండ్స్‌లో అసాల్ట్‌ కమాండర్‌గా, స్క్వాడ్రన్‌ కమాండర్‌గా, ఆ విభాగం చీఫ్‌గా పని చేసిన సమయంలో బాటీ దగ్గర్నుంచి చాలా విషయాలు తెలుసుకున్నానని అంజనీకుమార్‌ అన్నారు. ఇప్పుడు నక్సలిజం సమస్య పూర్తిగా తొలగిపోయిందంటే అందుకు కారణం భాటినేనని తెలిపారు.

Updated On 14 Jun 2023 12:40 AM GMT
Ehatv

Ehatv

Next Story