Nara Lokesh : అమిత్ షాని కలిసిన నారా లోకేష్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు అరెస్ట్ ను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Nara Lokesh met Amit Shah
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ని టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు అరెస్ట్(Chandrababu)ను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. విచారణ పేరుతో తననూ వేధిస్తున్నారని అమిత్ షా కు వివరించినట్లు తెలుస్తోంది. తన తల్లి భువనేశ్వరి(Bhuvaneshwari), భార్య బ్రాహ్మణి(Brahmani)ని సైతం ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Daggubati Purandeswari), బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పాల్గొన్నారు. భేటీకి సంబంధించి వివరాలు తెలియాల్సివుంది.
