ఢిల్లీ లోని రాజ్‌ఘాట్‌(Rajghat) వద్ద టీడీపీ నేతలు(TDP Leaders) నివాళులర్పించారు. మహాత్మాగాంధీకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో(Nara Lokesh) పాటు టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి(Anjali) ఘటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు(Chnadrababu Arrest) నిరసనగా మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టారు. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి(CM Jagan Mohan Reddy) రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను రాజ్‌ఘాట్‌ నుంచి దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అక్రమ కేసులు బనాయిస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి
రాజ్‌ఘాట్‌లో నారా లోకేశ్‌ సహా టీడీపీ నేతల మౌనదీక్ష
ఢిల్లీలో మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌లో టీడీపీ నేతల నివాళులు

ఢిల్లీ(Delhi) లోని రాజ్‌ఘాట్‌(Rajghat) వద్ద టీడీపీ నేతలు(TDP Leaders) నివాళులర్పించారు. మహాత్మాగాంధీకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో(Nara Lokesh) పాటు టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి(Anjali) ఘటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు(Chnadrababu Arrest) నిరసనగా మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టారు. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి(CM Jagan Mohan Reddy) రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను రాజ్‌ఘాట్‌ నుంచి దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అక్రమ కేసులు బనాయిస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ అవినీతి, నిరంకుశ పాలనపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.

దేశరాజధానిలో కొనసాగుతున్న నిరసనలు : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తప్పుడు కేసులతో జైలుకు పంపడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని డిల్లీలో టిడిపి నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో టిడిపి ఎంపిలు, మాజీ ఎంపిలు మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్ద మంగళవారం మౌనదీక్ష చేపట్టారు. తొలుత మహాత్ముడికి నివాళులర్పించిన నాయకులు అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఎంపిలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రులు కిమిడి కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎంపిలు నిమ్మల కిష్టప్ప, బికె పార్థసారధి, కొనకళ్ల నారాయణ, మురళీమోహన్, కంభంపాటి రామ్మోహన్ రావు, విశాఖకు చెందిన సీనియర్ నేత భరత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై జాతీయస్థాయి నాయకులు తమ గళాన్ని విన్పిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వైసిపి ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని, తెలుగుప్రజలకు ఆయన చేసిన సేవలను చెరిపి వేయలేరని ఎండిఎంకె నేత వైగో పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు, తదనంతర పరిణామాలపై టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ లోక్ సభలో ఆందోళన వ్యక్తం చేశారు.

Updated On 19 Sep 2023 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story