హైందవ సంస్కృతిలో(Hindu culture) సర్పపూజ(Snake Worship) అనాదిగా వస్తున్న ఆచారం. దేవ, రాక్షస, యక్ష, గంధర్వ, నాగ, పితృ, మానుష గణాలను సప్తగణాలంటారు. ఈ ఏడింట్లో నాగులకూ, మనుషులకూ(Human Beings) అవినాభావ సంబంధం ఉందని పురాణాలు చెబుతుంటాయి. నాగులు రజోగుణం అధికంగా కలిగిన గణాలు.
హైందవ సంస్కృతిలో(Hindu culture) సర్పపూజ(Snake Worship) అనాదిగా వస్తున్న ఆచారం. దేవ, రాక్షస, యక్ష, గంధర్వ, నాగ, పితృ, మానుష గణాలను సప్తగణాలంటారు. ఈ ఏడింట్లో నాగులకూ, మనుషులకూ(Human Beings) అవినాభావ సంబంధం ఉందని పురాణాలు చెబుతుంటాయి. నాగులు రజోగుణం అధికంగా కలిగిన గణాలు. ఆగ్రహంతో పాటు ఉపకారం చేసే తత్వం కూడా సర్పాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు గుణాల్లో నాగులు మనల్ని పోలి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్పజాతికి ఎనిమిది మంది మూలపురుషులు ఉన్నారు. వారిలో అనంతుడు(Anantha), వాసుకి(Vasuki), తక్షకుడు(Thakshaka), శంఖపాలుడు(shankapaludu), ధనుంజయుడు(Dhanunjayudu), కర్కోటకుడు(Karkotaka), మహాపద్ముడు(Maha Padmudu), కుశికుడు(Kushikudu) ముఖ్యులు. అనంతుడు, వాసుకి సత్వగుణ ప్రధానులు. శంఖపాల, ధనుంజయులు రజోగుణ ప్రధానులు. తక్షక, కర్కోటకులు తమోగుణ ప్రధానులు. ఆదిశేషుడు, నాగేంద్రుడు, వాసుకి, తక్షక పేర్లతో సర్పాన్ని దేవతలతో సమానంగా పూజించడం మన సంప్రదాయం. అంతకంటే ముఖ్యమైన సంగతి ఏమిటంటే- పాలసముద్రంలో శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు తల్పంగా, పరమశివునికి వాసుకి ఆభరణంగా, నాగేంద్రుడు గణపతికి యజ్ఞోపవీతంగా మారి తమ జన్మల్ని ధన్యం చేసుకున్నాయి. యోగ శాస్త్రాన్ని రచించిన పతంజలి(Pathanjali) ఆదిశేషుడి అవతారమేనని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. నాగపూజ విశిష్టత గురించి స్వయంగా శంకరుడే పార్వతీదేవికి చెప్పినట్లు స్కాందపురాణం(Skandapuranam) ప్రస్తావించింది. స్త్రీలు తమ అభీష్టసిద్ధి కోసం 'పాహిమాం నాగేంద్ర సౌభాగ్యం దేహిమే..' అంటూ నాగుల్ని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే నాగపూజను వివిధ ప్రాంతాల్లో ఏడాదికి రెండుసార్లు చేసుకుంటారు. కార్తికమాసంలో శుద్ధచవితిని నాగులచవితిగా, పంచమిని నాగపంచమిగా పూజలు చేస్తారు. పాములు కనిపించగానే భయపడకుండా, ఆ భయంతో సర్పజాతిని నాశనం చేయకుండా భూతదయను పెంచటానికి నాగారాధన ఎంతగా ఉపకరిస్తుంది.