అయోధ్య(Ayodhya) నగరం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. రామమందిర ప్రారంభం కోసం భక్తులు(Piligrims) వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. 22న జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఇప్పటికే వేలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్య(Ayodhya) నగరం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. రామమందిర ప్రారంభం కోసం భక్తులు(Piligrims) వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. 22న జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఇప్పటికే వేలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. ఈ క్రమంలో రాముడిపై ఉడతాభక్తిగా తమకు చేతనైన ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నారు భక్తులు. గుజరాత్‌కు(Gujarat) చెందిన జైలంగానియా వెండి ఉంగరంపై(Silver ring) అయోధ్య నమూనాను డిజైన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలోని నాగపూర్‌కు(Nagpur) చెందిన హృతిక్ రాజేంద్ర దారొడే అనే కళాకారులు వెయ్యినొక్క మందికి ఉచితంగా రాముడి పచ్చబొట్లు(Tatoo) వేయాలని నిర్ణయించుకున్నారు. 22 ఏళ్ల ఆ యువకుడు రాముడి వివిధ రూపాయలను భక్తుల చేతులు, ఛాతీ, భుజాలపై అందంగా డిజైన్ చేస్తున్నాడు. సాధారణంగా ఒక్కో టాటూకు హృతిక్ దారొడేకు(Hrithik darode) 350 రూపాయల ఖర్చు అవుతుంది. మరి వెయ్యినొక్క మందికి టాటూలు వేయాలంటే మూడున్నర లక్షల రూపాయలు అవుతుంది. రాముడి కోసం అంత భారాన్నీ తను మోస్తున్నాడు.