భారీ ఉష్ణోగ్రతలు, అంతకు మించి భయంకరంగా వీస్తున్న వడగాలులతో(Heatwaves) ఉత్తరభారతం(North India) అల్లాడిపోతున్నది. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌(UP), బీహార్‌(Bihar), రాజస్థాన్‌(Rajasthan), పంజాబ్‌(Punjab) హర్యానా(Haryana), జార్ఖండ్‌(Jarkhand) సహా పలు రాష్ర్టాల్లో గురు, శుక్రవారాల్లో 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోకి నాగ్‌పూర్‌లోని(Nagpur) ఓ ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్‌(ఏడబ్ల్యూఎస్‌)లో రికార్డు స్థాయిలో 56 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింటున్నారు.

భారీ ఉష్ణోగ్రతలు, అంతకు మించి భయంకరంగా వీస్తున్న వడగాలులతో(Heatwaves) ఉత్తరభారతం(North India) అల్లాడిపోతున్నది. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌(UP), బీహార్‌(Bihar), రాజస్థాన్‌(Rajasthan), పంజాబ్‌(Punjab) హర్యానా(Haryana), జార్ఖండ్‌(Jarkhand) సహా పలు రాష్ర్టాల్లో గురు, శుక్రవారాల్లో 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోకి నాగ్‌పూర్‌లోని(Nagpur) ఓ ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్‌(ఏడబ్ల్యూఎస్‌)లో రికార్డు స్థాయిలో 56 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింటున్నారు. దీని రీడింగ్స్‌పై కూడా దర్యాప్తు చేస్తుందేమో వాతావరణ శాఖ. 50 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నది మాత్రం వాస్తవం. ఇంతేసి ఉష్ణోగ్రతలు ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించి ఉండం! ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలలో ఉష్ణోగ్రతలు గతంలో ఎప్పుడూ లేని విధంగా పెరిగాయి. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటాయి. భరించలేని ఎండవేడి, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా వడదెబ్బతో 60 మందికి పైగా చనిపోయారు. బీహార్‌లోనే 32 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పది మంది సిబ్బంది కూడా ఉన్నారు.
నగరాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి అర్బన్‌ హీట్ ఐలాండ్‌ ఎఫెక్ట్ కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత కంటే నగరంలో అధిక ఉష్ణోగ్రత నమోదు అవ్వడాన్ని అర్బన్‌ హీట్‌ -ఐలాండ్‌ ఎఫెక్ట్‌ అంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని సహజ భూఉపరితలంతో పోలిస్తే నగరాల్లో భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉష్ణోగ్రతను ఎక్కువగా గ్రహిస్తాయి. పైగా ఏసీలు కూడా ఎక్కువయ్యాయి. వీటి నుంచి వచ్చే వేడి కూడా అర్బన్‌ హీట్‌ ఐలాండ్‌ ఎఫెక్ట్‌కు కారణమవుతోంది. ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి ఎల్‌నినో కూడా కారణం. పసిఫిక్‌ సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. ఎల్‌నినో బలహీనపడగానే లానినా ప్రభావం మొదలవుతుంది. పసిఫిక్‌ సముద్రంలో వాతావరణం చల్లబడటాన్ని లానినా అంటారు. లానినా వల్ల ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు వర్షపాతం కూడా బాగుంటుంది. ప్రస్తుత ఎల్‌నినో 2023లో ప్రారంభమైందని, దీని ప్రభావం ఈ ఏడాది జూన్‌లో ముగుస్తుందని వాతావరణ శాఖ అంటోంది.

Updated On 1 Jun 2024 12:13 AM GMT
Ehatv

Ehatv

Next Story