కేరళ(Kerala)లోని కొట్టాయం జిల్లా(Kottayam District) చెన్నపాడి అనే కుగ్రామం భయంతో వణికిపోతోంది. ఆ భయానికి కారణం గత కొద్ది రోజులుగా భూమి నుంచి భారీ శబ్దాలు రావడమే! వరుసగా నేల లోపలి నుంచి చప్పుళ్లు వస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమయ్యింది. అంతుపట్టని శబ్దాలకు కారణాలేమిటో తెలుసుకునే పనిని నిపుణులకు అప్పచెప్పింది.

కేరళ(Kerala)లోని కొట్టాయం జిల్లా(Kottayam District) చెన్నపాడి అనే కుగ్రామం భయంతో వణికిపోతోంది. ఆ భయానికి కారణం గత కొద్ది రోజులుగా భూమి నుంచి భారీ శబ్దాలు రావడమే! వరుసగా నేల లోపలి నుంచి చప్పుళ్లు వస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమయ్యింది. అంతుపట్టని శబ్దాలకు కారణాలేమిటో తెలుసుకునే పనిని నిపుణులకు అప్పచెప్పింది. శుక్రవారం తెల్లవారుజామున ఊర్లో రెండుసార్లు చెవులు పగిలేటట్టుగా భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. నాలుగు రోజుల కిందట చెన్నపాడి గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఇలాంటి చప్పుల్లే వినిపించాయి. వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోయినా మిస్టరీ శబ్దాలు వినిపిస్తుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. దీనిపై కేరళ గనులు, భూగర్భ శాఖ అధికారులు కూడా స్పందించారు. త్వరలోనే నిపుణుల బృందం ఆ ప్రాంతంలో పర్యటించి పరిశోధనలు చేస్తుందని చెప్పారు. కొద్ది రోజుల కిందట మొదటిసారి చప్పుళ్లు వినిపించినప్పుడే తాము ఈ ప్రాంతాన్ని పరిశీలించామని, ధ్వనుల ఆనవాళ్లు తమకు లభించలేదని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున కూడా ఇలాగే భారీ శబ్దాలు వచ్చినట్టు తమకు సమాచారం అందిందని, త్వరలోనే సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్సెస్‌ బృందం అక్కడకు వెళుతుందని తెలిపారు. వారు అధ్యయనం చేసిన తర్వాత ఆ వింత చప్పుళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా పరిధిలో గల కొన్ని గ్రామాల్లోనూ ఇలా భూమిలోపలి నుంచి వింత శబ్దాలు వినిపించాయి. అప్పుడు నిపుణులు అధ్యయనం చేసినా ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియరాలేదు.

Updated On 2 Jun 2023 6:03 AM GMT
Ehatv

Ehatv

Next Story