కాలం మారుతున్నా మనుషులు మారడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న మూఢనమ్మకాలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వందల ఏళ్ల నుంచి దళితులకు ఆలయ ప్రవేశం లేదు. దళితులు హిందూ మతానికి సంబంధించినవారే అయినా వారికి ఆలయంలోకి ప్రవేశం లేకుండా పూర్వీకులు విధించిన నిబంధనలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు, పలు ప్రజాసంఘాలు ఈ ఆచారాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఒకచోట దేశంలో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి.
కాలం మారుతున్నా మనుషులు మారడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న మూఢనమ్మకాలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వందల ఏళ్ల నుంచి దళితులకు ఆలయ ప్రవేశం లేదు. దళితులు హిందూ మతానికి సంబంధించినవారే అయినా వారికి ఆలయంలోకి ప్రవేశం లేకుండా పూర్వీకులు విధించిన నిబంధనలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు, పలు ప్రజాసంఘాలు ఈ ఆచారాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఒకచోట దేశంలో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. తాజాగా తిరువణ్ణామలై(Tiruvannamalai) దగ్గరలో ఉన్న అమ్మన్ గుడిలో(Amman Temple) ఎస్సీలు(SC) పూజలు చేశారని ఇతర కులస్తులు ఆ గుడినే వదిలేశారు.
ముత్తు మరియమ్మన్ ఆలయంలోకి(Muttu Mariyamman Temple) 80 ఏళ్లుగా ఎస్సీలను అనుమతించడం లేదు. తాండరంపట్టు పక్కనే ఉన్న తెన్ముదియానూర్ గ్రామంలోని హిందూ మత ధర్మదాయశాఖ ఆధీనంలో ఈ గుడి ఉంది. 80 ఏళ్ల పోరాటం తర్వాత, గత ఏడాది గుడిలోకి వెళ్లేందుకు దళితులకు అధికారులు అనుమతిచ్చారు. ఎస్సీలు గుడిలోకి ప్రవేశించారన్న కారణంతో దీంతో ఇది గిట్టని ఇతర కులాల వారు తమ కోసం మరో గుడి నిర్మాణం ప్రారంభించారు.
గత ఏడాది సంక్రాంతి సందర్భంగా ముత్తు మరియమ్మన్ ఆలయంలో 12 రోజుల పాటు వేడుకలు జరిగాయి. ఈ పండుగ సందర్భంగా గుడిలో పూజలు చేసుకుంటామని తిరువణ్ణా మలై హిందూ మత ధర్మదాయ శాఖకు దళితులు పిటిషన్ ఇచ్చారు. ఈ పిటిషన్ ఆధారంగా హిందూ ధార్మిక సంక్షేమశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఎస్సీలను గత 80 ఏళ్లుగా ఆలయంలోకి అనుమతించడం లేదని విచారణలో తేలింది. కుల, మతాలకు దేవాలయాలు అతీతమైనవంటూ వారికి ఆలయంలో పూజలు చేసుకునేందకు హిందూ ధార్మిక సంక్షేమశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఇతర కులస్తులు నిరసనలు చేపట్టారు. 100 మందికిపైగా అధికారుల సమక్షంలో ముత్తు మరియమ్మన్ ఆలయ ద్వారాలు తెరిచి స్వామి దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లారు.
దళితులను ఆలయ ప్రవేశం చేయించడంతో ఇతరు కులస్తులు ఆ ఆలయాన్ని వదిలి వేశారు. కొన్ని నెలల వరకు ఇతర కులాల వారు ముత్తు మరియమ్మన్ ఆలయంలో పూజలు చేయలేదు. మరో చోట మరియమ్మన్ ఆలయాన్ని నిర్మించేందకు పూనుకున్నారు. ఇతర కులాల వారంతా కలిసి డబ్బు డమ చేసుకొని 2 సెంట్ల భూమిని కొనుగోలు చేసి అక్కడ కొత్త గుడిని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.