మరో పాతిక రోజుల్లో అయోధ్య(Ayodhya) రామమందిర(Ram mandir) ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరగబోతున్నది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ వేడుకను కళ్లారా చూసేందుకు భక్తులు అయోధ్యకు తరలివెళుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ముస్లిం యువతి(Muslim Woman) కూడా బాలరాముడి దర్శనం కోసం అయోధ్యకు కాలినడకన(Walk) పయనమయ్యింది.
మరో పాతిక రోజుల్లో అయోధ్య(Ayodhya) రామమందిర(Ram mandir) ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరగబోతున్నది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ వేడుకను కళ్లారా చూసేందుకు భక్తులు అయోధ్యకు తరలివెళుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ముస్లిం యువతి(Muslim Woman) కూడా బాలరాముడి దర్శనం కోసం అయోధ్యకు కాలినడకన(Walk) పయనమయ్యింది. ముంబాయి(Mumbai) నుంచి అయోధ్యకు నడకయాత్ర చేపట్టి భారతదేశపు గొప్పదనాన్ని చాటి చెప్పింది. రాముడిని పూజించడానికి, ఆరాధించడానికి హిందువే కానక్కర్లేదనంటున్న ఆ యువతి 1,425 కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళుతోంది. ఆమె పేరు షేక్ షబ్నం(Shabnam). ఇప్పడు సోషల్ మీడియాలో(Social media), ప్రధాన మీడియాలో ఆమె గురించే ముచ్చటించుకుంటున్నారు. తన సహచరులు రామన్ రాజ్‌శర్మ(Raman Raj Sharma), వినీత్ పాండేలతో(Vineet Pandey) కలిసి ప్రయాణం చేస్తోంది. రాముడు ఎందరికో స్ఫూర్తి అని చెబుతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని సింధవకు చేరుకున్న షేక్ షబ్నం ప్రతి రోజూ పాతిక నుంచి 30 కిలోమీటర్లు నడుస్తున్నానని చెప్పింది. ఆమెకు సాయం చేయడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. అదే సమయంలో ఆమెకు భద్రత కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. భోజనం, వసతి ఏర్పాటు చేస్తున్నారు.