అయోధ్య రామాలయం(Ayodhya Ram Mandir)లో బాలరాముడి ప్రాణప్రతిష్ట అంగరంగవైభవంగా జరిగింది. కోట్లాది మంది టీవీలలో ఆ మహత్తరమైన ఘట్టాన్ని వీక్షించారు. ఇదిలా ఉంటే రామమందిరం ప్రారంభోత్సవం రోజున దేశవ్యాప్తంఆ అనేక మంది తల్లులు బిడ్డలకు జన్మనిచ్చారు.

Ram Mandir Consecration
అయోధ్య రామాలయం(Ayodhya Ram Mandir)లో బాలరాముడి ప్రాణప్రతిష్ట అంగరంగవైభవంగా జరిగింది. కోట్లాది మంది టీవీలలో ఆ మహత్తరమైన ఘట్టాన్ని వీక్షించారు. ఇదిలా ఉంటే రామమందిరం ప్రారంభోత్సవం రోజున దేశవ్యాప్తంఆ అనేక మంది తల్లులు బిడ్డలకు జన్మనిచ్చారు. ఆ శుభ ఘడియలో బిడ్డను కనాలని చాలా మంది తల్లులు సిజేరియన్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇదేం గొప్ప విషయం కాదు కానీ, ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ఫిరోజాబాద్‌కు చెందిన ఓ ముస్లిం మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. రాముడు వచ్చిన వేళలో పుట్టిన తన కొడుకుకు ఆమె ముద్దుగా రామ్హ్రీమ్ అని పేరు పెట్టుకుంది. మరోవైపు మహారాష్ట్రలోని థానేకు చెందిన మహిళ తన డెలివరీ డేట్ మంగళవారం కాగా, డాక్టర్లను అభ్యర్థించి సోమవారం మధ్యాహ్నం 12.30కు ప్రసవించింది.
