రైలులో(Train) తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైలు పేరునే పెట్టుకుంది. ఇక నుంచి తన బిడ్డను ఆ పేరుతోనే పిల్చుకుంటానని చెప్పింది. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలో(Maharashtra) జరిగింది. జూన్‌ 6వ తేదీన ఉదయం కొల్హాపూర్‌-ముంబాయి మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో(Mahalakshmi express) ప్రయాణిస్తున్న 31 ఏళ్ల నిండు గర్భిణి ఫాతిమా ఖాతూన్‌కు పురిటి నొప్పులు మొదలయ్యాయి.

రైలులో(Train) తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైలు పేరునే పెట్టుకుంది. ఇక నుంచి తన బిడ్డను ఆ పేరుతోనే పిల్చుకుంటానని చెప్పింది. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలో(Maharashtra) జరిగింది. జూన్‌ 6వ తేదీన ఉదయం కొల్హాపూర్‌-ముంబాయి మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో(Mahalakshmi express) ప్రయాణిస్తున్న 31 ఏళ్ల నిండు గర్భిణి ఫాతిమా ఖాతూన్‌కు పురిటి నొప్పులు మొదలయ్యాయి. రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకుంటున్నప్పుడు భర్త తయ్యబ్‌కు విషయాన్ని చెప్పింది. వాంతులు అవుతుండటంతో ఫాతిమా రైలులోని టాయ్‌లెట్‌కు వెళ్లింది. ఎంతసేపటికి ఫాతిమా తిరిగి రాకపోయేసరికి తయ్యబ్‌ టాయ్‌లెట్‌లోకి(Toilet) వెళ్లి చూశాడు. ఫాతిమా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలుసుకున్నాడు. రైలులో ఉన్న ఇతర మహిళా ప్రయాణికులకు ఈ సంగతి చెప్పాడు. వారంతా వచ్చి ఫాతిమాకు సాయం చేశారు. తన భార్యకు ప్రసవమైన సంగతి రైల్వే పోలీసులకు తెలిపాడు తయ్యబ్‌. రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకోగానే అక్కడి రైల్వే సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకెల్లారు. తల్లీబిడ్డకు చికిత్స అందించిన డాక్టర్లు వారి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డిశ్చార్జ్‌ చేశారు. తన భార్య డెలివరీ తేదీ జూన్ 20వ తేదీ అని, అయితే ఇంతలోనే ఆమె రైలులో కానుపు జరిగిందని చెప్పాడు. తమకు ఇప్పటికే ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. తాము ఆ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తిరుపతి నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళుతున్న కొందరు ప్రయాణికులు తమ బిడ్డను చూసి మహాలక్షి ఎక్స్‌ప్రెస్‌లో లక్ష్మీదేవి పుట్టిందని అన్నారని, ఈ మాట విన్న తన భార్య తమ బిడ్డకు మహాలక్ష్మి అనే పేరు పెట్టిందని తయ్యబ్‌ చెప్పుకొచ్చాడు.

Updated On 11 Jun 2024 4:17 AM GMT
Ehatv

Ehatv

Next Story