అసలు ముంబాయిలో(Mumbai) జరిగినట్టుగా కృష్ణాష్టమి(Krishna ashtami) సంబరాలు మరెక్కడా జరగవంటే అతిశయోక్తి కాదు.
అసలు ముంబాయిలో(Mumbai) జరిగినట్టుగా కృష్ణాష్టమి(Krishna ashtami) సంబరాలు మరెక్కడా జరగవంటే అతిశయోక్తి కాదు.. మనం జన్మాష్టమి రోజున ఉట్టి కొడతాం కదా! ముంబాయివాసులేమో మానవ పిరమిడ్‌ను(Human pyramid) నిర్మిస్తారు.. ఏ వీధి చూసినా ఉట్టి సంబరాలే! ఉట్టి కొట్టడమంటే కృష్ణుడికి చాలా ఇష్టమట! మొదట్లో సరదాగా మొదలుపెట్టిన ఈ క్రీడ ఇప్పుడు సంప్రదామయ్యింది. ఒకరికొరకు భుజాలు కలుపుతూ పిరమిడ్ ఆకారంలోకి మారిపోతారు. కొన్నిచోట్ల మూడు వరసల పిరమిడ్‌లు ఉంటే.. మరికొన్ని చోట్లా తొమ్మిది వరసల వరకు మానవ పిరమిడ్‌లను నిర్మిస్తారు.. అందనంత ఎత్తులో దహీ హండీ ఉంటుంది.. అంటే పెరుగు, వెన్నతో నింపిన కుండ అన్నమాట! ఈ కుండను ఎవరైతే కొడతారో వారు విజేతలుగా నిలుస్తారు. ఉట్టి కొట్టడానికి సమాయత్తమవుతున్నవారిపై రంగునీళ్లు చల్లుతారు.. కేకలు పెడతారు.. ఉత్సాహపరుస్తారు.. కృష్ణుడి పాటలు పాడతారు.. ముంబాయి వీధుల్లో అయితే ఉట్టి వేడుకలు మహా రంజుగా సాగుతాయి.. ఉట్టి కొట్టేందుకు ప్రత్యేకమైన బృందాలు ఉంటాయి.. పిరమిడ్ నిర్మాణంలో వీరు సాధన చేస్తుంటారు. అన్నట్టు వీటికి స్పాన్సర్‌షిప్‌లు కూడా ఉంటాయి.. ఉట్టికొట్టి విజయం సాధించిన బృందానికి కొన్ని సంస్థలు పది లక్షల రూపాయలు కూడా ఇస్తాయి.. ఈ ఉత్సవం టూరిస్టు అట్రాక్షన్‌గా మారింది.. ఈ వేడుకను చూసేందుకు దేశదేశాల నుంచి పర్యాటకులు వస్తారు..