పదహారేళ్ల కిందట నటి శిల్పాశెట్టి(Shilpa Shetty)ని హాలీవుడ్ స్టార్(Hollywood Star) రిచర్డ్ గెరె(Richard Gere) స్టేజ్‌పైనే ముద్దుపెట్టుకున్నాడు. అప్పుడు ఇది పెద్ద వివాదమయ్యింది. కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. ఇన్నాళ్ల తర్వాత ఆ కిస్సింగ్ వివాదం(Kissing Issue)లో శిల్పాషెట్టికి ఊరట లభించింది. ఆమె అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ముంబాయి సెషన్స్ కోర్టు(Mumbai Sessions Court) తెలిపింది. అసలు స్టేజీపైన ముద్దు పెట్టింది రిచర్డ్ గెరె తప్ప శిల్పా కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
పదహారేళ్ల కిందట నటి శిల్పాశెట్టి(Shilpa Shetty)ని హాలీవుడ్ స్టార్(Hollywood Star) రిచర్డ్ గెరె(Richard Gere) స్టేజ్‌పైనే ముద్దుపెట్టుకున్నాడు. అప్పుడు ఇది పెద్ద వివాదమయ్యింది. కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. ఇన్నాళ్ల తర్వాత ఆ కిస్సింగ్ వివాదం(Kissing Issue)లో శిల్పాషెట్టికి ఊరట లభించింది. ఆమె అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ముంబాయి సెషన్స్ కోర్టు(Mumbai Sessions Court) తెలిపింది. అసలు స్టేజీపైన ముద్దు పెట్టింది రిచర్డ్ గెరె తప్ప శిల్పా కాదని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పుడేం జరిగిందంటే.. ఢిల్లీ(Delhi)లో 2007, ఏప్రిల్ ఏడున ఎయిడ్స్‌పై ఓ అవగాహన కార్యక్రమం జరిగింది. దీనికి శిల్పాషెట్టితో పాటు హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె హాజరయ్యారు. అప్పుడు స్టేజీపైనే శిల్పాను గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టాడు రిచర్డ్ గెరె. ఈ దృశ్యం చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. ముక్కున వేలేసుకున్నారు. ముద్దుతో ఎయిడ్స్ వ్యాపించదన్న సందేశం ఇవ్వడానికే తాను అలా చేసినట్టు వివరణ ఇచ్చుకున్నారు రిచర్డ్ గెరె. కానీ శిల్పా షెట్టి, రిచర్డ్ గెరెల ప్రవర్తన చాలా అసభ్యంగా ఉందని అప్పట్లో రాజస్తాన్(Rajastan)తో పాటు ముంబాయి(Mumbai)లో కూడా కేసులు నమోదయ్యాయి. చీప్ పబ్లిసిటీ కోసమే తనపై కేసు పెట్టారని శిల్పా అప్పుడే కౌంటరిచ్చారు. ఇంతకాలానికి శిల్పాషెట్టికి న్యాయస్థానం నుంచి ఊరట లభించింది. శిల్పాషెట్టి అసభ్యంగా ప్రవర్తించినట్టు పిటిషనర్లు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని ముంబాయి సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించింది. బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం నేరమన్న పోలీసుల వాదనను కూడా ముంబాయి సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఇంతటితో ఈ వివాదం ముగిసినట్టే.