దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త(Businessman) రతన్ టాటాకు సంబంధించి ముంబై పోలీసులకు(Mumbai police) బెదిరింపు ఫోన్ కాల్(threatening call) వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తిని లొకేషన్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి స్కిజోఫ్రెనియాతో(Schizophrenia) బాధపడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. అతడు ఎంబీఏ(MBA) డిగ్రీ చదివాడు. కాల్ లొకేషన్ కర్ణాటక(Karnataka) అని గుర్తించారు.

పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. రతన్ టాటా భద్రతను పెంచాలని కాల్ చేస్తున్న వ్యక్తి కోరాడు. అలా జరగకపోతే తమ పరిస్థితి సైరస్ మిస్త్రీలా తయారవుతుందని అన్నారు. కాల్ వచ్చిన వెంటనే పోలీసులు.. టాటా భద్రత కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు.
అదే సమయంలో కాల్ చేసిన వ్యక్తి గుర్తింపును కనుగొనే పనిని మరొక బృందానికి అప్పగించారు. టెక్నికల్ సపోర్ట్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ సహాయంతో టీమ్ కాలర్‌ను కనిపెట్టింది. కాల్ చేసిన వ్యక్తి లొకేషన్ కర్ణాటక అని తేలింది. అతడు మహారాష్ట్రలోని పూణే నగర వాసి అని పోలీసులు తెలిపారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. అతడు గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆయన భార్య భోసరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని పోలీసులు నిర్ణయించుకున్నారు.