హంతకుడు(Accused) ఇవాళ కాకపోయినా రేపైనా కచ్చితంగా దొరుకుతాడు. ఈ విషయం చాలా సార్లు రుజువయ్యింది. లేటెస్ట్‌గా మళ్లీ ప్రూవ్‌ అయ్యింది. ఓ హత్య కేసులో మూడు దశాబ్దాలకు పైగా తప్పించుకుని తిరుగుతున్న ఓ నిందితుడిని ముంబాయి(Mumbai) పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. 62 ఏళ్ల దీపక్‌ నారాయణ్‌(Deepak Narayan) భీసే 1989లో స్థానికంగా జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో నిందితుడు. ఇతడికి 1992లో బెయిల్(Bail) దొరికింది.

హంతకుడు(Accused) ఇవాళ కాకపోయినా రేపైనా కచ్చితంగా దొరుకుతాడు. ఈ విషయం చాలా సార్లు రుజువయ్యింది. లేటెస్ట్‌గా మళ్లీ ప్రూవ్‌ అయ్యింది. ఓ హత్య కేసులో మూడు దశాబ్దాలకు పైగా తప్పించుకుని తిరుగుతున్న ఓ నిందితుడిని ముంబాయి(Mumbai) పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. 62 ఏళ్ల దీపక్‌ నారాయణ్‌(Deepak Narayan) భీసే 1989లో స్థానికంగా జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో నిందితుడు. ఇతడికి 1992లో బెయిల్(Bail) దొరికింది. అప్పట్నుంచి మళ్లీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. 2003లో దీపక్‌ నారాయణ్‌ను పరారీలో వున్న వ్యక్తిగా కోర్టు(Court) ప్రకటించింది. అతడి ఆచూకి కనిపెట్టాల్సిందిగా పోలీసులను(Police) ఆదేశించింది. అప్పట్నుంచి పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు. దీపక్‌ నారాయణ్‌ నివాసం ఉండే కాందివలీకి వెళ్లారు. అతడి ఆచూకి లభించలేదు. పోలీసులు వెళ్లినప్పుడల్లా అతడు చనిపోయి ఉండవచ్చని స్థానికులు చెప్పేవారు. ఎలాగోలా ఇటీవల దీపక్‌ భార్య ఫోన్‌ నంబర్‌ను(Phone Number) సంపాదించారు పోలీసులు. దాన్ని ట్రాక్‌ చేశారు. ముంబాయికి 60 కిలోమీటర్ల దూరంలోని నాలాసొపారా ప్రాంతంలో నిందితుడు ఉన్నట్టు పసికట్టారు. 31 ఏళ్లలో అనేక స్థావరాలు మార్చిన దీపక్‌ నారాయణ్‌ భార్య ముగ్గురు పిల్లలతో కలిసి రెండేళ్లుగా నాలాసొపారాలో ఉంటున్నాడు. చెట్ల నరికివేత పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నాడు.

Updated On 1 Jan 2024 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story