నవీ ముంబాయిలో(Mumbai) జరగకూడనిది జరిగింది. పోలీసులు ఓ 13 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. అది కూడా ఐపీసీ , పోక్సో(POCSO) చట్టాల కింద..! ఎందుకు అరెస్ట్ చేశారంటే తన 15 ఏళ్ల అక్క గర్భం(Pregnant) దాల్చడానికి ఇతడే కారణం కాబట్టి..! తాను గర్భవతిని కావడానికి తమ్ముడే కారణమని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది.
నవీ ముంబాయిలో(Mumbai) జరగకూడనిది జరిగింది. పోలీసులు ఓ 13 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. అది కూడా ఐపీసీ , పోక్సో(POCSO) చట్టాల కింద..! ఎందుకు అరెస్ట్ చేశారంటే తన 15 ఏళ్ల అక్క గర్భం(Pregnant) దాల్చడానికి ఇతడే కారణం కాబట్టి..! తాను గర్భవతిని కావడానికి తమ్ముడే కారణమని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది. ఇద్దరూ కలిసి పోర్న్(Porn) చూడటం వల్లే ఇదంతా జరిగిందట! గత సంవత్సరం డిసెంబర్‌లో అక్కాతమ్ముళ్లు మొదటిసారి సెక్స్‌లో పాల్గొనడానికి ప్రయత్నించారని, కానీ ఆ ప్రయత్నంలో వారు విఫలమయ్యారని ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారి చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరిలో అక్కపై తమ్ముడు అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ అమ్మాయి నెలసరి తప్పడంతో విషయాన్ని తల్లికి చెప్పింది. ఈ కేసును ఖండేశ్వర్ పోలీసుస్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. మైనర్ బాలుడి విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్‌కు వదిలిపెట్టారు. ఐపీసీలోని 376, 376(2) సెక్షన్ల కింద బాలుడిపై కేసు బుక్ చేశారు. పోక్సో చట్టంలోని 4,6,8,12 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు.