దేశంలోనే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy). అనతికాలంలోనే ఈ సంస్థ వినియోగదారులను ఆకట్టుకుంది. దేశ, విదేశాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఫుడ్‌తో పాటు గ్రాసరీలు (Groceries), పార్శిళ్లు (Parcels) డెలివరీ చేస్తూ వస్తోంది
దేశంలోనే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy). అనతికాలంలోనే ఈ సంస్థ వినియోగదారులను ఆకట్టుకుంది. దేశ, విదేశాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఫుడ్‌తో పాటు గ్రాసరీలు (Groceries), పార్శిళ్లు (Parcels) డెలివరీ చేస్తూ వస్తోంది. అయితే, ఫుడ్ డెలివరీ విషయంలో అక్కడక్కడ కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంది. ఒకటి ఆర్డర్ పెడితే మరొకటి డెలివరీ కావడం అక్కడక్కడ చూస్తున్నాం. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ముంబై (Mumbai)లో ఉంటున్న ఫొటోగ్రాపర్ ఉజ్వల్‌పూరి (Ujwal Puri).. కోలాబాలోని ప్రముఖ కేఫ్‌గా ప్రసిద్ధిగావించిన 'లియోపోల్డ్' (Leopold) నుంచి చికెన్ ఐటంను స్విగ్గీ ద్వారా ఆర్డర్ పెట్టుకున్నాడు. స్విగ్గీ సాఫీగా డెలివరీ చేసింది. తనకు నచ్చిన చికెన్‌ను తింటూ ఆరాధిస్తున్నాడు. సగం తిన్న తర్వాత ఉడికించిన మెడిసిన్ (Medicine)ను చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. లియోపోల్డ్ కేఫ్ నగరంలోని పురాతన ఇరానీ కేఫ్‌లలో ఒకటి, ఈ కేఫ్‌కు స్థానికులు, పర్యాటకులు తరచూ వస్తుంటారు. 2008 ముంబై ఉగ్రదాడి (Terror Attack) జరిగిన ప్రదేశాలలో కేఫ్ కూడా ఒకటి. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని స్విగ్గీ స్పందించింది.