ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్‌గా రోహిత్‌ను(Rohit) మార్చడంపై రోహిత్ ఫ్యాన్స్ అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. రోహిత్‌కు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వలేదని.. అవమానకరంగా అతనిని తప్పించారని మండిపడుతున్నారు. ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్‌కే దక్కుతుందని.. అలాంటి వ్యక్తిని కెప్టెన్సీ ఎలా తప్పిస్తారని ఆగ్రహం చెందుతున్నారు.

ముంబై సహా అనేక నగరాల్లో ముంబై ఇండియన్స్‌కు చెందిన జెర్సీలను తగలబెడుతున్నారు. రోహిత్ ఉన్నందునే ముంబై ఇండియన్స్ టీమ్‌కు మద్దతు ఇచ్చామని ఇకపై తమ మద్దతు ఆ జట్టుకు ఉండబోదని పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో(Social media) కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఫ్రాంజైజీ ఇన్‌స్టాలో(Instagram) లక్షన్నర మంది ఫాలోయర్స్‌ను కోల్పోయింది. దీనిపై రోహిత్ స్పందన కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2013లో తొలిసారిగా నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు టైటిళ్లను గెలుచుకున్న మొదటి ఫ్రాంచైజీగా అవతరించింది. అతని కెప్టెన్సీలో 158 మ్యాచ్‌లలో 56.33% విజయ శాతంతో 89 మ్యాచ్‌లను ముంబై ఇండియన్స్ గెలిపించింది. హఠాత్తుగా రోహిత్‌ను కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తొలగించడంతో అభిమానులు బాధపడుతున్నారు.