సోమవారం ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలోని ఇంధన కేంద్రంపై భారీ బిల్‌బోర్డ్ పడిపోవడంతో
సోమవారం ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలోని ఇంధన కేంద్రంపై భారీ బిల్‌బోర్డ్ పడిపోవడంతో 14 మంది మరణించారు. 74 మంది గాయపడ్డారు. ముంబై నగరంలో భారీ వర్షం అల్లకల్లోలం సృష్టించింది. అయితే ఆ తర్వాత బలమైన ఈదురుగాలుల కారణంగా భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. పంత్‌నగర్‌లోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వెంబడి ఉన్న పోలీస్ గ్రౌండ్ ఫ్యూయల్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. అనేక కార్లు బిల్‌బోర్డ్ కింద చిక్కుకున్నట్లు వీడియోలు చూపించాయి. ఈదురు గాలుల ధాటికి 100 అడుగుల ఎత్తైన భారీ ఇనుప హోర్డింగ్ కూలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. వంద మంది దాకా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
సమతా నగర్‌లో భారీ హోర్డింగ్ కూలి రైల్వే పెట్రోల్ పంపుపై పడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీంలు రంగంలోకి దిగారు. 14 మంది మృతదేహాల్ని వెలికి తీశాయి. ఈ హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబయి నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. హోర్డింగ్ యజమాని భవేష్ భిడేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. హోర్డింగ్‌ను ఇన్‌స్టాల్ చేసిన ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భవేష్ భిండే డైరెక్టర్ గా ఉన్నారు.