ఐస్‌క్రీమ్‌లో(Ice cream) అప్పుడప్పుడు బల్లో, చిట్టెలుకనో, పురుగు పుట్ర తారసపడుతుంటాయి. వాటిని చూసిన తర్వాత ఇక చస్తే ఐస్‌క్రీమ్ తినకూడదని ఒట్టేసుకుంటాం!
ఐస్‌క్రీమ్‌లో(Ice cream) అప్పుడప్పుడు బల్లో, చిట్టెలుకనో, పురుగు పుట్ర తారసపడుతుంటాయి. వాటిని చూసిన తర్వాత ఇక చస్తే ఐస్‌క్రీమ్ తినకూడదని ఒట్టేసుకుంటాం! వారం పది రోజుల తర్వాత ఒట్టు తీసి గట్టుమీద పెడతామనుకోండి. అది వేరే విషయం. కానీ ముంబాయిలోని(Mumbai) ఓ వ్యక్తి ఐస్‌క్రీమ్‌లో కనిపించింది చూసి షాకయ్యాడు. కడుపులో దేవినట్టు అనిపించింది. వాంతికొచ్చిన ఫీలింగ్ కలిగింది. ముంబాయిలోని మలాడ్‌లో(Malad) ఉంటున్న డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావ్ అనే 27 ఏళ్ల కుర్రాడికి ఐస్‌క్రీమ్ తినాలనిపించింది. వెంటనే ఆన్‌లైన్ డెలివరీ యాప్ ద్వారా బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశాడు. అరగంటలో ఐస్‌క్రీమ్ చేతికందింది. చల్లచల్లటి ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తుండగా గట్టిగా ఏదో తగిలినట్టయ్యింది. ఏమిటయ్యి ఉంటుందని పరీక్షగా చూశాడు. అంతే వాంతి వచ్చినంత పనయ్యింది. రెండు సెంటిమీటర్ల పొడవు ఉన్న మనిషి వేలి(Finger) ముక్క అది. అది కూడా షాక్ అయ్యాడు బ్రెండన్ సెర్రావ్. వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు ఐస్‌క్రీం కంపెనీపై కేసు నమోదు చేశారు. ఐస్‌క్రీమ్‌లో లభించిన మానవ అవయవాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్)కు పంపినట్టు చెప్పారు మలాడ్ పోలీసు అధికారులు. అయితే నిజంగానే ఇది మనిషి వేలి ముక్కనా? లేక మరేదైనా అనేది విచారణలో తేలనుంది.