ప్రియుడికి ప్రేయసి బ్రేకప్(Breakup) చెప్పిన తర్వాత సదరు ప్రియుడు మానసిక వేదనతో ఆత్మహత్య(Suicide) చేసుకుంటే అందులో ప్రియురాలి తప్పేమీ లేదని, అతడిని సూసైడ్‌కు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబాయి కోర్టు(Mumbai Court) స్పష్టం చేసింది.
ప్రియుడికి ప్రేయసి బ్రేకప్(Breakup) చెప్పిన తర్వాత సదరు ప్రియుడు మానసిక వేదనతో ఆత్మహత్య(Suicide) చేసుకుంటే అందులో ప్రియురాలి తప్పేమీ లేదని, అతడిని సూసైడ్‌కు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబాయి కోర్టు(Mumbai Court) స్పష్టం చేసింది. ఈ మాట చెబుతూనే ఇష్టం వచ్చినట్టుగా ప్రేమికులను మార్చడం కూడా మంచి పద్దతి కాదని చెప్పింది న్యాయస్థానం. ప్రియురాలి తిరస్కరణకు గురైన వ్యక్తికి చట్టపరమైన ఉపశమనం లేదని కోర్టు చెప్పింది. అసలేం జరిగిందంటే.. నితిన్ కేనీ, మనీషా చుడస పరస్పరం ప్రేమించుకున్నారు. కొంతకాలం ఇలా ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. తర్వాత నితిన్‌కు మనీషా కాదనుకుంది. రాజేశ్ పన్వర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. మనీషా అలా చేయడాన్ని నితిన్ తట్టుకోలేకపోయాడు. తీవ్రమైన మనో క్షోభను అనుభవించాడు. 2016 జనవరి 15వ తేదీన తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. దాంతో నితిన్ బంధువులు కోర్టుకు వెళ్లారు. మనీషా కారణంగానే నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడని కోర్టుకు తెలిపారు. మనీషా బ్రేకప్ చెప్పడంవల్లే నితిన్ మానసికంగా కుంగిపోయాడని అనిపిస్తున్నదని అదనపు సెషన్స్ జడ్జ్ ఎన్.పి.మెహతా అన్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిట్టు రుజువు కావాలంటే బాధితుడిని అందుకు పురిగొల్పినట్టు కానీ, సలహా ఇచ్చినట్టు కానీ స్పష్టం కావాలని మెహతా అన్నారు.