చేతిలో స్మార్ట్ ఫోన్(Smart Phone) ఉంటే చాలు..సోషల్ మీడియా(Social media) అకౌంట్లను ఓపెన్ చేయడం, అందులో వీడియోలు, ఫోటోలు పెట్టేయడం..చాలా మంది యువతకు ఇది అలవాటుగా మారింది. సోషల్ మీడియాలో తమ టాలెంట్‌ను ప్రదర్శించుకోవాలని, తద్వారా ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు. మెట్రో రైళ్లు(Metro), లోకల్ ట్రైన్స్(Local Train), బస్టాండ్(Bus stop), బజారు ఇలా ఎక్కడపడితే అక్కడ రీల్స్(Reels) చేస్తున్నారు.

Mumbai Constable Viral Video
చేతిలో స్మార్ట్ ఫోన్(Smart Phone) ఉంటే చాలు..సోషల్ మీడియా(Social media) అకౌంట్లను ఓపెన్ చేయడం, అందులో వీడియోలు, ఫోటోలు పెట్టేయడం..చాలా మంది యువతకు ఇది అలవాటుగా మారింది. సోషల్ మీడియాలో తమ టాలెంట్‌ను ప్రదర్శించుకోవాలని, తద్వారా ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు. మెట్రో రైళ్లు(Metro), లోకల్ ట్రైన్స్(Local Train), బస్టాండ్(Bus stop), బజారు ఇలా ఎక్కడపడితే అక్కడ రీల్స్(Reels) చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇలాగే ఓ యువతి ముంబాయి(Mumbai) లోకల్ ట్రైన్‌లో రీల్స్ చేసింది. ఆమెతో పాటు ఓ కానిస్టేబుల్(Constable) కూడా డాన్సులు చేయడమే వీడియోకు అదనపు ఆకర్షణ. ఓ అమ్మాయి లోకల్ రైలులో డాన్స్ చేస్తుంటుంది. ఆమె వెనుక ఓ పోలీసు కానిస్టేబుల్ నిలబడి ఉంటాడు. డాన్స్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి కానస్టేబుల్‌ను తగులుతుంది. అతడు ఏమంటాడోనని భయపడుతుంది. పోలీసు మాత్రం తలుపు దగ్గరకు వెళ్లవద్దు. పడిపోతావు అంటూ జాగ్రత్తలు చెబుతాడు. తర్వాత ఆ అమ్మాయి డాన్స్‌ను కంటిన్యూ చేస్తుంది. అప్పుడు ఆమెతో పాటు కానిస్టేబుల్ కూడా చిందులేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
