నటి జియా ఖాన్(jiah khan) మృతి కేసులో ముంబాయి(Mumbai) సీబీఐ కోర్టు(CBI Court) సంచలన తీర్పు చెప్పింది. జియా ఖాన్ ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని(Suraj pancholi) నిర్దోషిగా ప్రకటించింది. సూరజ్ కారణంగానే జియా ఖాన్ ఆత్మహత్య(Sucide) చేసుకున్నదనడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు తెలిపింది.
నటి జియా ఖాన్(jiah khan) మృతి కేసులో ముంబాయి(Mumbai) సీబీఐ కోర్టు(CBI Court) సంచలన తీర్పు చెప్పింది. జియా ఖాన్ ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని(Suraj pancholi) నిర్దోషిగా ప్రకటించింది. సూరజ్ కారణంగానే జియా ఖాన్ ఆత్మహత్య(Sucide) చేసుకున్నదనడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు తెలిపింది. సూరజ్‌పై వచ్చిన ఆరోపణలకు తగు రుజువులు లేనందున సూరజ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తున్నామని సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎ.ఎస్.సయ్యద్(A.S Syedh) అన్నారు. పదేళ్ల కిందటి ఈ కేసులో జియా ఖాన్‌కు న్యాయం జరుగుతుందని చాలా మంది అనుకున్నారు. వారంతా ఈ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తన్నారు. ఈ తీర్పును జియాఖాన్ తల్లి రబియా(Rubiya) సవాల్ చేసే అవకాశం ఉంది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్(Amithab bachchaan) నటించిన నిశ్శబ్ద్(Nishabdh) సినిమాతో జియాఖాన్ తెరంగ్రేటం చేశారు. ఆ తర్వాత అమీర్‌ఖాన్(Amir khan) గజిని సినిమాలో మెరిశారు. హౌజ్‌ఫుల్(House full) చిత్రంలో మైమరపించారు. ఆమె చేసింది ఈ మూడు సినిమాలే కానీ బాలీవుడ్ పాతిక సినిమాలకు సరిపడా పేరును సంపాదించుకున్నారు. న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన జియా ఖాన్ అసలు పేరు నఫిసా రిజ్విఖాన్. ఇంగ్లీష్-అమెరికన్ నటిగా ఆమె గుర్తింపుపొందారు. ఎంతో కెరీర్ ఉన్న ఆమె 2013, జూన్ 3న ముంబాయి జుహూలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.
ఘటనా స్థలంలో ఆమె రాసిన ఆరు పేజీల లేఖ పోలీసులకు దొరికింది. ఆ లేఖలో ఆమె చెప్పుకున్న దాని ప్రకారం సూరజ్ పాంచోలి ఆత్మహత్యకు ప్రేరేపించాడని పోలీసులు గుర్తించారు. జూన్ 10న ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం అతడిని అరెస్ట్ చేశారు. జియాఖాన్ తల్లి రబియా ఖాన్ మాత్రం తన కూతురుది హత్యేనని అంటున్నారు. జియా ఖాన్‌ను సూరజ్ పాంచోటి మానసికంగా, శారీరకంగా హింస పెట్టాడని, అతి తట్టుకోలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నదని వాదిస్తున్నారు రబియా! తన కూతురుతో సూరజ్ బలవంతంగా సంబంధం పెట్టుకున్నాడని అంటున్నారు.
జియాఖాన్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ ఆమె బాంబే హైకోర్టు తలుపు తట్టారు. ఆమె పిటిషన్‌పై బాంబే హైకోర్టు సానుకూలంగా స్పందించింది. సీబీఐ(CBI) దర్యాప్తునకు ఆదేశించింది. 2014 జులైలో సీబీఐ కేసును టేకప్ చేసింది. మహారాష్ట్ర పోలీసులతో పాటు సీబీఐ కూడా ఈ కేసులో చట్టపరమైన రుజువులను సేకరించలేదని రబియా ఆరోపిస్తున్నారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయడంతో విచారణ తమ పరిధిలోకి రాదని ముంబాయి సెషన్స్ కోర్టు 2021లో కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానికి బదిలీ చేసింది. ఈ కేసులో 22 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. ముంబాయి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఈరోజు కోర్టు పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది..