సినిమా ప్రేమికులకు శుభవార్త. కేవలం 99 రూపాయలకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడొచ్చు. మే 31వ తేదీన సినిమా లవర్స్ డే(Cinema lovers day) కాబట్టి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Multiplex Association of India) ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న PVR, Inox, Cinepolis, Mirage, CityPride, Asian, MovieTine వంటి మల్టీప్లెక్స్ థియేటర్ల (Multiplex Theaters)లో కేవలం 99 రూపాయలకే సినిమా చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తోంది.

Cinema Lover Day
సినిమా ప్రేమికులకు శుభవార్త. కేవలం 99 రూపాయలకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడొచ్చు. మే 31వ తేదీన సినిమా లవర్స్ డే(Cinema lovers day) కాబట్టి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Multiplex Association of India) ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న PVR, Inox, Cinepolis, Mirage, CityPride, Asian, MovieTine వంటి మల్టీప్లెక్స్ థియేటర్ల (Multiplex Theaters)లో కేవలం 99 రూపాయలకే సినిమా చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా 99 రూపాయలకే చూడొచ్చు. మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. టికెట్ రేట్లు చూసి కోరికలను అణచివేసుకుంటారు. అలాంటి వారందరూ 31వ తేదీన మల్టీప్లెక్స్‌కు వెళ్లొచ్చు. పేటీఎం, అమెజాన్ పే, బుక్‌మైషో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈనెల 31 సినిమా టిక్కెట్లు బుక్ చేసుకునే వారు 99 రూపాయలతోపాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే థియేటర్ కౌంటర్ వద్ద టిక్కెట్ కొనుగోలు చేస్తే మాత్రం ఎలాంటి ఇతర చార్జీలూ ఉండవు. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాలు ఈనెల 31వ తేదీన విడుదల కానున్నాయి. వాటిని 99 రూపాయలకే చూడొచ్చు.
