స్వలింగ వివాహంపై(Same Gender Marriage) గత అక్టోబర్‌లో ఐదుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని సుప్రీంకోర్టులో(supreme court) రివ్యూ పిటిషన్లు(Review Petition) దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రుచూడ్‌(Justice Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట రివ్యూ పిటిషన్లను ప్రస్తావించారు. బహిరంగ కోర్టులో విచారించాలని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.

స్వలింగ వివాహంపై(Same Gender Marriage) గత అక్టోబర్‌లో ఐదుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని సుప్రీంకోర్టులో(supreme court) రివ్యూ పిటిషన్లు(Review Petition) దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రుచూడ్‌(Justice Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట రివ్యూ పిటిషన్లను ప్రస్తావించారు. బహిరంగ కోర్టులో విచారించాలని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరపున ప్రముఖ లాయర్‌ ముకుల్‌ రోహత్గీ(Mukul Rohatgi) వాదించారు. రివ్యూ పిటిషన్లపై విచారణ నవంబర్‌ 28న లిస్ట్‌ అయిందని దానిని తొలంగించకూడదని రోహత్గీ కోరారు. ఓపెన్‌ కోర్టు విచారణకు అభ్యర్థించామని, పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలు దీనిపై ఆధారపడి ఉన్నాయని రోహత్గీ చెప్పారు.

అయితే ఈ కేసును తాను ఇంకా పరిశీలించలేదని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. కేసు లిస్టింగ్‌ కోసం అన్ని అడ్మినిస్ట్రేటివ్‌ ఫార్మాలిటీస్‌ పూర్తి చేయాలని పిటిషనర్లను సీజేఐ(CJI) కోరారు. స్వలింగ సంఘాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. అక్టోబర్‌లో ఐదుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రియా చక్రవర్తి, అభయ్ డాంగ్‌ సహా అనేక పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. స్వలింగ వివాహాలపై రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాలకు అధికారం ఉందని.. చట్టాలను రూపొందించడానికి లేదా సవరించడానికి చట్ట సభల నిర్ణయాల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఆర్టికల్ 32 ప్రకారం తమకు ఎలాంటి ఉపశమనం లభించలేదని పిటిషనర్లు వివరించారు

Updated On 24 Nov 2023 12:52 AM GMT
Ehatv

Ehatv

Next Story