మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ అన్నయ్య అఫ్జల్ అన్సారీ లోక్ సభ సభ్యత్వం రద్దయింది. ఈ మేరకు సోమవారం (మే 1) లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అఫ్జల్ అన్సారీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కేసులో ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అఫ్జల్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ(Mukhtar Ansari) అన్నయ్య అఫ్జల్ అన్సారీ(Afzal Ansari) లోక్ సభ(Loksabha) సభ్యత్వం రద్దయింది. ఈ మేరకు సోమవారం (మే 1) లోక్‌సభ సెక్రటేరియట్(Lok Sabha Secretariat ) నోటిఫికేషన్ జారీ చేసింది. అఫ్జల్ అన్సారీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గ్యాంగ్‌స్టర్ యాక్ట్(Gangster Act) కేసులో ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అఫ్జల్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం.. క్రిమినల్ కేసు(Criminal Case)లో రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడిన వ్యక్తి అనర్హుడని.. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆరేళ్లపాటు అనర్హత కొనసాగుతుందని పేర్కొంది.
ముక్తార్ అన్సారీకి 14 ఏళ్ల నాటి ఇదే గ్యాంగ్‌స్టర్ చట్టం కేసులో కోర్టు 10 ఏళ్ల జైలుశిక్ష , ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. నవంబర్ 22, 2007న, ఘాజీపూర్ జిల్లాలోని మహ్మదాబాద్ కొత్వాలిలో అఫ్జల్ అన్సారీ, ముఖ్తార్ అన్సారీలను గ్యాంగ్‌స్టర్ చార్ట్‌లో చేర్చారు. వారిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసు నమోదు చేయబడింది.
సెప్టెంబర్ 23, 2022న ఇద్దరిపై అభియోగాలు మోపబడ్డాయి. విచారణ కూడా పూర్తయింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ కేసులో ముక్తార్, అఫ్జల్ అన్సారీలకు శనివారం కోర్టు శిక్ష విధించింది. అఫ్జల్ అన్సారీ ఘాజీపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం(Ghazipur parliamentary constituency) నుంచి బీఎస్పీ టికెట్‌పై గెలిచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.. ముఖ్తార్ అన్సారీ పొరుగు జిల్లా మౌలోని మౌ సదర్ అసెంబ్లీ స్థానం నుండి గతంలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ముఖ్తార్ అన్సారీ 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు. సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (సుభాష్ప) నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అతని కుమారుడు అబ్బాస్ అన్సారీ అతని స్థానంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్తార్ అన్సారీ ప్రస్తుతం క్రిమినల్ కేసుల్లో బండాలోని జైలులో ఉన్నారు.