వినాయకుడి ఉత్సవాలు(Vinayak chathurthi) ముంబాయి(Mumbai) నగరంలో జరిగినట్టు మరెక్కడా జరగవంటే అతిశయోక్తి కాదు.

వినాయకుడి ఉత్సవాలు(Vinayak chathurthi) ముంబాయి(Mumbai) నగరంలో జరిగినట్టు మరెక్కడా జరగవంటే అతిశయోక్తి కాదు. అసలు వినాయకుడి ఉత్సవాలు మొదలయ్యిందే మహారాష్ట్రలో(Maharashtra)! గణశుడి వేడుకలకు ముంబాయిలోని లాల్‌బాగ్చా(Laal Bagcha) చాలా ఫేమస్‌. ఈ కమిటీకి వందేళ్ల చరిత్ర ఉంది. ఇప్పటికే లాల్‌బాగ్చా రాజా వినాయకుడి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తాజాగా పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ(Mukesh ambani) వినాయకుడిపై తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ముఖ్యంగా అనంత అంబానీ(ananth ambani), రాధిక(Radhika) పెళ్లి తర్వాత ఇదే మొదటి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక అనంత్‌ అంబానీ అయితే లాల్‌బాగ్చా వినాయకుడికి ఘనమైన బహుమతిని అందించారు. 20 కిలోల బంగారు కిరీటాన్ని(Gold Crown) వినాయకుడికి కానుకగా అందించారు. దీని విలువ ఇంచుమించు 15 కోట్ల రూపాయలు ఉంటుంది. దాదాపు రెండు నెలల పాటు కష్టపడి ఈ కిరీటాన్ని తయారుచేశారు. గత పదిహేనేళ్లుగా అనంత్ అంబానీ లాల్‌బాగ్చా రాజా కమిటీకి అండదండలు అందిస్తున్నారు అనంత్‌ అంబానీ.

Eha Tv

Eha Tv

Next Story