రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh ambani) చిన్న కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్(Pre-Wedding) వేడుకలు శుక్రవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో(Jamnagar) అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌కు ప్రపంచంలోని అత్యంత సంపన్నులతో సహా వెయ్యి మంది కంటే ఎక్కువ మంది అతిథులు హాజరయ్యారు. బిల్ గేట్స్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, రణ్‌వీర్‌సింగ్, రాంచరణ్ వంటి ప్రముఖులు ఎందరో ఈవెంట్‌కు వచ్చారు.

ఈ సందర్బంగా అనంత్ అంబానీ ప్రసంగించారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో తన కుమారుడు అనంత్ అంబానీ(Ananth ambani) తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడటంతో రిలయన్స్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ కన్నీటి పర్యంతమయ్యారు. తన ప్రసంగంలో, అనంత్ అంబానీ తనను ప్రత్యేకంగా భావించినందుకు తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన చిన్నతనంలో ఆరోగ్యంతో తాను పడ్డ కష్టాల గురించి మాట్లాడాడు. "నాకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి నా కుటుంబం కష్టపడింది. గత రెండు, మూడు నెలల నుంచి రోజుకు 18 గంటల పాటు నా కోసం కుటుంబ సభ్యులు శ్రమించారని చెప్పుకొచ్చారు. తాత-నానమ్మ, అమ్మ-నాన్న, అన్న-వదిన, సోదరి-బావలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'నా జీవితం పూర్తిగా గులాబీల మంచం కాదు, నేను ముళ్ల బాధను అనుభవించాను, నా చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను, కానీ మా నాన్న, అమ్మ తోడుగా నిలిచారని.. నేను బాధపడకుండా వాళ్లు నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారని' అనంత్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేస్తుండగా ముఖేష్ అంబానీ వెక్కివెక్కి ఏడ్చారు.
ఇంకా అనంత్ ప్రసంగిస్తూ.. రాధిక మర్చంట్(Radhika Merchant) తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని అనంత్ అంబానీ అన్నారు. రాధికను చూస్తే తనలో తుఫాన్, సునామీ మొదలవుతుందని చెప్పారు. రాధికను రోజూ చూస్తున్నా అప్పుడే చూసినట్లు ఉంటుందన్నారు. తను నా జీవితంలోకి రావడం నా అదృష్టమని ఆయన అన్నారు.
మరోవైపు శుక్రవారం నాడు, పాప్ స్టార్ రిహన్నా(Rihanna) భారతదేశంలో మొదటిసారిగా ప్రదర్శన ఇచ్చింది. తన ప్రదర్శనలో రిహన్న 'డైమండ్స్', 'రూడ్ బాయ్', 'పోర్ ఇట్ అప్' వంటి హిట్‌ల ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.