ఎన్నికల్లో(ELection) అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, తండ్రీ కొడుకులు, తండ్రీ బిడ్డలు ఇలా బంధువులు ప్రత్యర్థులుగా బరిలో దిగడం సాధారణమే! ప్రతి ఎన్నికల్లో ఇలాంటి చిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాకపోతే భార్యభర్తలిద్దరూ పోటీపడటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఇటావా(Etava) లోక్‌సభ నియోజకవర్గంలో ఇలాంటి పోటీనే నెలకొంది.
ఎన్నికల్లో(ELection) అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, తండ్రీ కొడుకులు, తండ్రీ బిడ్డలు ఇలా బంధువులు ప్రత్యర్థులుగా బరిలో దిగడం సాధారణమే! ప్రతి ఎన్నికల్లో ఇలాంటి చిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాకపోతే భార్యభర్తలిద్దరూ పోటీపడటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఇటావా(Etava) లోక్‌సభ నియోజకవర్గంలో ఇలాంటి పోటీనే నెలకొంది. భారతీయ జనతా పార్టీ(BJP) తరఫున సిట్టింగ్ ఎంపీ రామ్ శంకర్ కతేరియా(Ram Shankar Kateria) మరోసారి బరిలో దిగారు. అయితే ఆశ్చర్యంగా బుధవారం ఇదే స్థానం నుంచి రామ్ శంకర్ కతేరియా భార్య మృదుల కతేరియా(Mrudhula kateria) ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. 2019లో జరిగిన ఎన్నికలప్పుడు కూడా మృదుల ఇలాగే ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. అయితే చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈసారి కూడా ఆమె నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకుంటారని రామ్‌శంకర్ కతేరియా అంటున్నాడు. మృదుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. ఈసారి నామినేషన్ వేసింది విత్‌డ్రా చేసుకోవడానికి కాదని, మొగుడితో అమీతుమీ తేల్చుకోవడానికేనని ప్రకటించారు.