కేరళలోని మలప్పురంలో 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ అయింది. ఈ వ్యక్తి దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత లక్షణాలు కనిపించాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కేరళలోని మలప్పురంలో 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ అయింది. ఈ వ్యక్తి దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత లక్షణాలు కనిపించాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించిన త‌ర్వాత‌.. అతని శాంపిల్‌ను పరీక్షకు పంపగా వైరస్ సోకిన‌ట్లు నిర్ధారణ అయింది. దీంతో ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు.

లక్షణాలను చూసిన తర్వాత ఆ వ్యక్తి కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మంగళవారం తెలియజేశారు. రోగి కుటుంబ స‌భ్యుల‌ నమూనాలను కూడా పరీక్ష కోసం పంపారు. నివేదిక కోసం వేచి చూస్తున్నామ‌ని ఆమె తెలిపారు.

జిల్లా ఆరోగ్య అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. వైరస్ సోకిన‌ వ్యక్తి ఇటీవల దుబాయ్ నుండి కేరళకు వచ్చాడు. ఆ త‌ర్వాత‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అనంతరం మంజేరి మెడికల్ కాలేజీలో చేర్పించారు. మంకీపాక్స్ సోకే అవకాశం ఉందని అనుమానంతో.. అతని నమూనాలను పరీక్ష కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి పంపిన‌ట్లు తెలిపారు.

గత వారం, దేశ రాజధాని ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. హర్యానాలోని హిసార్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకింది. అతన్ని ఢిల్లీ ప్రభుత్వ ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేర్చారు.

మంకీపాక్స్ ను ఐసోలేటెడ్ కేసుగా పేర్కొంటూ.. జూలై 2022 నుండి భారతదేశంలో మొత్తం 30 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన మంకీపాక్స్ క్లాడ్ 1కి సంబంధించి ప్రస్తుతం ఉన్న పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీకి.. ఈ కేసు వేరుగా ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story