క్యాష్ ఫర్ క్వెరీ(డ‌బ్బులు తీసుకొని ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం) కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ అంశంపై ఎథిక్స్ కమిటీ ఈరోజే సభలో నివేదిక సమర్పించింది. ఈ నిర్ణయానికి నిరసనగా విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. వాకౌట్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ,

క్యాష్ ఫర్ క్వెరీ(డ‌బ్బులు తీసుకొని ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం) కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ అంశంపై ఎథిక్స్ కమిటీ ఈరోజే సభలో నివేదిక సమర్పించింది. ఈ నిర్ణయానికి నిరసనగా విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. వాకౌట్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు మోయిత్రాకు మ‌ద్ద‌తుగా ఉన్నారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ఎంపీగా మహువా మోయిత్రా ప్రవర్తన అనైతికంగా, అనుచితంగా ఉందన్న కమిటీ నిర్ధారణలను సభ అంగీకరిస్తున్నట్లు తెలిపారు. అందుకే ఆమె ఎంపీగా కొనసాగడం తగదన్నారు.

లోక్‌సభ నిర్ణయంపై మహువా మోయిత్రా స్పందిస్తూ.. నన్ను మౌనంగా ఉంచడం ద్వారా అదానీ ఇష్యూ నుంచి తప్పించుకోవచ్చని మోదీ ప్రభుత్వం భావిస్తే అది సరికాదన్నారు. అదానీ మీకు ఎంత ముఖ్యమో.. ఓ మహిళా ఎంపీని వేధించడానికి ఎంత వరకు వెళ్లగలరో.. ఈ స‌భ‌ దేశం మొత్తానికి చూపించిందని అన్నారు. ఎథిక్స్ ప్యానెల్ నివేదికలో ప్రతి నిబంధనను ఉల్లంఘించారని మొయిత్రా అన్నారు. నాకు 49 ఏళ్లు.. వచ్చే 30 ఏళ్ల పాటు పార్లమెంట్ లోపల, బయట మీతో పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు.

ఎథిక్స్ కమిటీ తన నివేదికలో మొయిత్రా లోక్ స‌భ‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. నివేదికను సమర్పించిన తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దానిపై చర్చకు ప్రతిపాదనను సమర్పించారు.

Updated On 8 Dec 2023 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story