Mt Everest : ఎవరెస్ట్ పర్వాతారోహకులకు కొత్త చిక్కులు..!
ఇకపై ఎవరెస్ట్(Mt Everest) పర్వతారోహణ చేయాలనుకున్నవారికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలు(Rules) విధించారు. ఇకపై పర్వతంపై విసర్జించిన మలాన్ని(Poop) ప్రత్యేక సంచుల్లో బేస్ క్యాంప్‌కు తీసుకురావాలి. ఆ సంచులను తప్పనిసరిగా తనిఖీ చేస్తారు. పర్వతారోహకుల మల విసర్జనలతో ఎవరెస్ట్ శిఖరం దుర్గంధం వెదజల్లుతోందని దీంతో అక్కడ అపరిశుభ్రవాతావరణం ఏర్పడుతుందని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

విపరీతంగా పేరుకుపోతున్న మల, ఇతర వ్యర్థాల వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి. దీంతో ఎవరెస్ట్ పర్వత్వానికి చెందిన నేపాల్‌లోని పసాంగ్ లాము గ్రామీణ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మున్సిపాలిటీ చైర్మన్ మింగ్మా షెర్మా బీబీసీతో(Mingma Sherma BBC) మాట్లాడారు. దీంతో పర్వతాల్లో దుర్వాసన వస్తున్నదని చెప్పారు. దీనివల్ల కొంత మంది పర్వతారోహకులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు. ఈ పరిస్థితి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్న ఆయన, తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని, పొరుగున ఉన్న మౌంట్ లోట్సేను అధిరోహించాలనుకునే ఔత్సాహికులు రసాయనాలతో కూడిన ప్రత్యేక సంచులను బేస్ క్యాంప్‌లో కొనుగోలు చేయాలని మింగ్మా షెర్పా వెల్లడించారు. పర్వతారోహకులు బేస్ క్యాంప్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆ మల సంచులను తనిఖీ చేస్తారని చెప్పారు. దీని ద్వారా ఎవరెస్ట్ పర్వతాలపై మల విసర్జాలను నివారించి అక్కడ పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పుతామని.. అక్కడి పర్యావరణాన్ని కాపాడుతామని అన్నారు.