లవ్ ఈజ్ బ్లైండ్ అని అన్నారు ఇంగ్లీషు వాళ్లు. ప్రేమ గుడ్డిదంటూ మనవాళ్లూ ఓప్పేసుకున్నారు.
లవ్ ఈజ్ బ్లైండ్ అని అన్నారు ఇంగ్లీషు వాళ్లు. ప్రేమ గుడ్డిదంటూ మనవాళ్లూ ఓప్పేసుకున్నారు. యుక్త వయసులో ఉన్నవారు గుడ్డి ప్రేమలో పడ్డారంటే అనుకోవచ్చు. వయసు ముదిరిన వారు కూడా ఇలా ముందూ వెనుకా ఆలోచించుకోకుండా ప్రేమలో పడిపోవడమే ఆశ్చర్యం. ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కాస్‌గంజ్‌లో జరిగింది. పెళ్లయ్యి పది మంది పిల్లలున్న వ్యక్తి పెళ్లయ్యి ఆరుగురు సంతానం ఉన్న ఓ మహిళను గాఢంగా ప్రేమించాడు. ఆమె కూడా ఇతగాడిని మోహించింది. ఓ ఫైన్ మార్నింగ్ ఇద్దరూ తమ తమ ఇంట్లోంచి జంప్(elope) అయ్యారు. దీనికే మీరు ఆశ్చర్యపోకండి.. ఇంకో షాకింగ్ విషయం ఉంది. ఆ మహిళ ఎవరంటే తన ప్రేమికుడి కుమారుడికి కాబోయే అత్త కావడమే ఈ ప్రేమకథలో ట్విస్టు. వివరాల్లోకి వెళితే కూలిపని చేసుకునే ఓ వ్యక్తి, ఈ -రిక్షా డ్రైవర్‌గా ఉన్న షకీల్ మంచి స్నేహితులు. పాతిక ముప్పయేళ్లుగా వీరి స్నేహబంధం సాగుతోంది. తన కుమారుడికి అతడి కూతురునిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు షకీల్. ఈ విషయాన్ని తన ఫ్రెండ్‌కు చెప్పాడు. అతడు కూడా ఓకే అన్నాడు. జూన్ 17వ తేదీన పెళ్లి చేద్దామని రెండు కుటుంబాలు డిసైడయ్యాయి. ఈ క్రమంలోనే షకీల్, అతడి ఫ్రెండ్ భార్య తరచూ ముచ్చటించుకునేవారు. ఆ ముచ్చట కాస్తా ప్రేమగా మారింది. జూన్ 3వ తేదీన ముదురు ప్రేమికులు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. పది మంది పిల్లలు ఉన్న షకీల్, ఆరుగురు పిల్లలున్న పెళ్లి కూతురు తల్లి ఇలా చేయడం చూసి బంధువులు, చుట్టుపక్కల వారు నిర్ఘాంతపోయారు. కొందరు నొసలు చిట్లించారు. పాపం పెళ్లి కూతురు తండ్రి మొహం చూపించుకోలేకపోతున్నాడు. తన భార్యను వెతికిపెట్టమని పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు కూడా ప్రేమ జంట కోసం అన్వేషిస్తున్నారు.