తల్లి ప్రేమను చెప్పడానికి అక్షరాలు సరిపోవు. వర్ణించడానికి పదాలు దొరకవు. బిడ్డ కోసం తల్లి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. ప్రాణాలను కూడా పణంగా పెడుతుంది. అలాంటి తల్లి ప్రేమను చాటిచెప్పే మరో ఘటన బీహార్‌లోని(Bihar) బార్హ్ రైల్వేస్టేషన్‌లో(Barh Railway Station) చోటు చేసుకుంది.
తల్లి ప్రేమను చెప్పడానికి అక్షరాలు సరిపోవు. వర్ణించడానికి పదాలు దొరకవు. బిడ్డ కోసం తల్లి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. ప్రాణాలను కూడా పణంగా పెడుతుంది. అలాంటి తల్లి ప్రేమను చాటిచెప్పే మరో ఘటన బీహార్‌లోని(Bihar) బార్హ్ రైల్వేస్టేషన్‌లో(Barh Railway Station) చోటు చేసుకుంది. రైలు ట్రాక్‌పై పడిన బిడ్డలను కాపాడుకునేందుకు ఏకంగా తల్లి తన శరీరాన్ని రక్షణగా ఉంచింది. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, బిడ్డలు బతికితే చాలనుకున్నా ఆ మాతృమూర్తిని ఏమని పొగడాలి? బీహార్‌లోని బార్హ్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఢిల్లీ(Delhi) వెళ్లే విక్రమ్ శిలా ఎక్స్‌ప్రెస్ కోసం ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఇంతలో రైలు వచ్చింది. ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. అక్కడ రైలు కాసేపే ఆగుతుంది. అందుకే అంత హడావుడి. ఈ క్రమంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. లోపులాటలో ప్లాటఫామ్‌కు,
రైలుకు మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో తన ఇద్దరు పిల్లలతో పాటు పడిపోయింది. దీన్ని ఎవరు గమనించలేదు. అదే సమయంలో రైలు కదలడం మొదలయ్యింది. తన పిల్లలను రక్షించుకోవడానికి ఆ తల్లి మనసు పరితపించింది. వెంటనే తన శరీరంతో పిల్లను చుట్టేసుకుని కదలకుండా అలాగే వంగిపడుకుంది. అంగుళాల గ్యాప్‌లో వారి పక్క నుంచి రైలు వెళ్లింది. చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. ఏమవుతుందోనని ఆందోళన చెందారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీకాలేదు. అప్పటికే రైలు ఎక్కిన తండ్రి విషయం తెలుసుకుని అమాంతం రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పైకి దూకేశాడు. ట్రయిన్ వెళ్లిన తర్వాత మహిళను, పిల్లలను పైకి తీసుకొచ్చారు స్థానికులు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పిల్లల కోసం ప్రాణాలొడ్డి మరి తల్లి చేసిన ఆ సాహసోపేతమైన పనిని అందరూ కొనియాడారు. తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుందని అనుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.