అత్తా కోడళ్లు తగవులు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని(UttarPradesh) ఆగ్రాలో(Agra) ఇలాగే అత్తాకోడళ్లు గొడవపెట్టుకున్నారు. ఆ గొడవకు కారణం తెలిస్తే బిత్తరపోతారు. అత్తగారేమో(Mother-in-law) కోడలిను(Daughter-in-law) జీన్స్ వేసుకోవాలని పోరుతోంది. కోడలేమో చీరలే(Saree) కడతాను తప్ప జీన్స్(Jeans) వేసుకోనని కరాఖండిగా చెబుతోంది. అత్త రోజూ జీన్స్ ధరిస్తుందట! కోడలికేమో జీన్స్ అంటే కంపరమట! తనకు చీర కట్టుకోవడమే ఇష్టమని ఎంతగా చెబుతున్నా తన మాటను అత్త వినట్లేదన్నది కోడలి కంప్లయింట్!
అత్తా కోడళ్లు తగవులు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని(UttarPradesh) ఆగ్రాలో(Agra) ఇలాగే అత్తాకోడళ్లు గొడవపెట్టుకున్నారు. ఆ గొడవకు కారణం తెలిస్తే బిత్తరపోతారు. అత్తగారేమో(Mother-in-law) కోడలిను(Daughter-in-law) జీన్స్ వేసుకోవాలని పోరుతోంది. కోడలేమో చీరలే(Saree) కడతాను తప్ప జీన్స్(Jeans) వేసుకోనని కరాఖండిగా చెబుతోంది. అత్త రోజూ జీన్స్ ధరిస్తుందట! కోడలికేమో జీన్స్ అంటే కంపరమట! తనకు చీర కట్టుకోవడమే ఇష్టమని ఎంతగా చెబుతున్నా తన మాటను అత్త వినట్లేదన్నది కోడలి కంప్లయింట్! అత్తగారు పట్టిన పట్టు వదలకపోవడంతో ఇక లాభం లేదనుకుని పోలీసులను ఆశ్రయించింది కోడలు. హరిపర్వత్‌కు చెందిన ఓ యువకుడికి, ఎత్మాద్‌పుర్ పరిధిలో ఉంటున్న యువతితో ఏడాది కిందట పెళ్లయింది. అత్తింట్లో అడుగుపెట్టిన కోడలికి కొత్తరకం వేధింపులు మొదలయ్యింది. తనలాగే రోజూ జీన్స్ వేసుకోవాలని కోడలిపై అత్త తెగ ఒత్తిడి తెచ్చింది. దీంతో కోడలు సరాసరి ఆగ్రా పోలీసు స్టేషన్‌లో(Police station) అత్తపై కంప్లయింట్ ఇచ్చింది. తాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చానని, తనకు జీన్స్ ధరించడం ఇష్టంలేదని చెబుతూ, ఈ విషయం భర్తకు చెబితే అతడు తిరిగి తననే కొడుతున్నాడని పోలీసులతో మొరపెట్టుకుంది. ఈ ఫిర్యాదు పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కోడళ్లు జీన్స్ వేసుకుంటే తిట్టిపోసే అత్తగార్లను చూశాం కానీ ఇక్కడ రివర్స్ కావడమే విశేషం. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నామని ఎసీపీ సుకన్యశర్మ అంటున్నారు.