ఉత్తరపద్రేశ్‌లో(Uttar Pradesh) తోడేళ్లు(Warewolves) ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఉత్తరపద్రేశ్‌లో(Uttar Pradesh) తోడేళ్లు(Warewolves) ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గుంపుగా వచ్చి పిల్లల ప్రాణాలు తోడేస్తున్నాయి. భరూచ్‌లోని హార్డి(Hardy in Bharuch) ప్రాంతంలో ఆదివారం అయిదేళ్ల బాలుడు పరాస్(Paras) తన కుటుంబసభ్యులతో కలిసి నిద్రపోతున్నప్పుడు ఓ తోడేలు దాడి చేసి ఎత్తుకెళ్లింది. ఇది గమనించిన పరాస్ తల్లి మరో ఆలోచన లేకుండా వెంటనే మంచం మీద నుంచి తోడేలుపై దూకింది. ధైర్యంగా, చాకచక్యంగా దాని మెడను గట్టిగా నొక్కి పెట్టింది. దాంతో ఆ తోడేలుకు ఊపిరి ఆడలేదు. దెబ్బకు పరాస్‌ను వదిలిపెట్టింది. తర్వాత ఆమె గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు నిద్రలేచారు. వారు వచ్చే సరికి తోడేలు పారిపోయింది. గత 10 రోజులుగా భరూచ్‌తో పాటు మరికొన్ని జిల్లాలలో తోడేళ్లు ఊళ్ల మీద పడుతున్నాయి. చీకటి పడితే చాలు జనాలు హడలిపోతున్నారు. సోమవారం మరో బాలికను తోడేళ్లు పొట్టనపెట్టుకున్నాయి. తోడేళ్లను పట్టుకోవడానికి చిన్న పిల్లల మూత్రంతో తడిసిన రంగు రంగుల బొమ్మలను అవి విశ్రాంతి తీసుకునే నదీ పరీవాహక ప్రాంతాల్లో పెడుతున్నారు అధికారులు.