అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చిందో మహిళ. తనతో సహజీవనం(Live-in relation) చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై(Daughter) అత్యాచారానికి(Molestation) ప్రోత్సహించిందో తల్లి. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన కేరళలో(Kerala) జరిగింది. ఈ తల్లి చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన ఓ మహిళ తన భర్తను వదిలిపెట్టి ప్రియుడు(Lover) శిశుపాలన్‌తో సహజీవనం చేస్తోంది.
అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చిందో మహిళ. తనతో సహజీవనం(Live-in relation) చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై(Daughter) అత్యాచారానికి(Molestation) ప్రోత్సహించిందో తల్లి. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన కేరళలో(Kerala) జరిగింది. ఈ తల్లి చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన ఓ మహిళ తన భర్తను వదిలిపెట్టి ప్రియుడు(Lover) శిశుపాలన్‌తో సహజీవనం చేస్తోంది. ఆమె ఏడేళ్ల కూతురు కూడా ఆమెతో పాటే ఉంది. ఈ క్రమంలో బాలికపై శిశుపాలన్ అనేక సార్లు లైంగికదాడికి(Sexual Assault) దిగాడు. దిగ్బ్రాంతి కలిగించే విషయమేమింటే కొన్నిసార్లు స్వయంగా తల్లే తన కూతురును అతడి దగ్గరకు కూతురును తీసుకెళ్లి లైంగికదాడికి ప్రోత్సహించడం. 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలంలో శిశుపాలన్ ఏడేళ్ల చిన్నారిపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. బాధితురాలి 11 ఏళ్ల సోదరి ఇంటికి వచ్చినప్పుడు కానీ ఈ దారుణం బయటపడలేదు. తనపై జరుగుతున్న లైంగికదాడిని అక్కతో చెప్పుకుంది. వాడు పెద్దమ్మాయిని కూడా వేధింపులకు గురి చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఓ రోజు అక్కాచెల్లెళ్లిద్దరూ ఇంట్లోనుంచి తప్పించుకుని వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ జరిగిన విషయాన్ని చెప్పుకున్నారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి తల్లితో పాటు శిశుపాలన్‌ను కూడా అరెస్ట్ చేశారు. విచారణ సమయంలోనే శిశుపాలన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పాడుపని చేసిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఆరు నెలల కఠిన కారాగారశిక్ష కూడా విధించింది. ప్రస్తుతం పిల్లలు బాలల సంరక్షణ గృహంలో(child care home) నివసిస్తున్నారు.