తన బిడ్డను సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో(social media) కథనాలు రావడంతో ఆ అవమానం భరించలేక ఓ తల్లి ఆత్మహత్య(Suicide) చేసుకుంది. ఏప్రిల్ 28వ తేదీన చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ పసిబిడ్డ రమ్య అనే మహిళ చేతుల్లోంచి జారిపడింది. అయితే స్థానికులందరూ కలిసి ఆ బిడ్డను కాపాడారు.

Ramya Suicide
తన బిడ్డను సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో(social media) కథనాలు రావడంతో ఆ అవమానం భరించలేక ఓ తల్లి ఆత్మహత్య(Suicide) చేసుకుంది. ఏప్రిల్ 28వ తేదీన చెన్నైలోని(Chennai) ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ పసిబిడ్డ రమ్య(Ramya) అనే మహిళ చేతుల్లోంచి జారిపడింది. అయితే స్థానికులందరూ కలిసి ఆ బిడ్డను కాపాడారు. రమ్యకు బిడ్డను సరిగా చూసుకోవడం రాదని స్థానికులు విమర్శించారు. కొన్ని న్యూస్ ఛానెళ్లు ఫెయిల్యూర్ మదర్(Failure Mother) పేరుతో కథనాలు ప్రసారం చేశాయి. దీంతో ఆ అవమానాలు తట్టుకోలేక భర్త, బిడ్డను తీసుకుని కోయంబత్తూరు కరమడైలోని తన పుట్టింటికి వెళ్లింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ ఆగకపోయేసరికి తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో వాళ్లు ఇంటికి వచ్చేసరికి రమ్య సృహలో లేకపోవడం చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
