ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్(International Association of Cancer) రిజిస్ట్రీస్ ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 40,000-50,000 కంటే ఎక్కువ బ్రెయిన్ ట్యూమర్(Brain Tumor) కేసులు నమోదవుతున్నాయి, ఈ కేసులలో 20% పిల్లలు(Children) కూడా ఉండడం గమనార్హం. బ్రెయిన్ ట్యూమర్ల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని జరుపుకుంటారు.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్(International Association of Cancer) రిజిస్ట్రీస్ ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 40,000-50,000 కంటే ఎక్కువ బ్రెయిన్ ట్యూమర్(Brain Tumor) కేసులు నమోదవుతున్నాయి, ఈ కేసులలో 20% పిల్లలు(Children) కూడా ఉండడం గమనార్హం. బ్రెయిన్ ట్యూమర్ల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని జరుపుకుంటారు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు, నివారణ మరియు చర్యల గురించి అవగాహన కల్పించడానికి భారతదేశంలో వివిధ కార్యక్రమాలు మరియు స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ క్యాంపుల్లో మెదడు కణితులను ముందస్తుగా గుర్తించడం, రోగులు మరియు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, పరిశోధన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం మరియు మెరుగైన చికిత్స ఎంపికలపై అవగాహన కల్పిస్తారు.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 40,000 నుండి 50,000 కంటే ఎక్కువ బ్రెయిన్ ట్యూమర్ కేసులు నమోదవుతున్నాయి మరియు ఈ కేసులలో 20 శాతం పిల్లలు మరియు 24,000 మందికి పైగా ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్‌లకు గురవుతున్నారు. బోరివాలికి చెందిన అపెక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ వివేక్ పటేల్ న్యూరోసర్జన్ స్పందిస్తూ “బ్రెయిన్ ట్యూమర్‌లు మెదడు లేదా పరిసర ప్రాంతాల్లోని కణాల అసాధారణ పెరుగుదల ఉంటుందని. ఈ పెరుగుదలలు క్యాన్సర్ లేనివి లేదా ప్రాణాంతక క్యాన్సర్ కావచ్చు. మెదడు కణితులు, మెదడు పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. ఇది మన శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది . బ్రెయిన్ టూమర్లు 120 కంటే ఎక్కువ రకాలున్నాయి. బ్రెయిన్ ట్యూమర్ ఉంటే లక్షణాలు తలనొప్పి, మూర్ఛలు/ఫిట్స్, మైకము, దృష్టిలో ఇబ్బందులు, వాంతులు మొదలైనవి ఉండవచ్చు. క్యాన్సర్ కాని కణితులు సాధారణ మెదడు కణజాలంపై కూడా ప్రభావం చూపుతాయి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. మెదడు కణితులు ఉన్న యువకులకు నడక, సమతుల్యత సమస్యలు కూడా ఉండవచ్చు.
అదనంగా, చేతులు, కాళ్లు లేదా ముఖంలో బలహీనత లేదా తిమ్మిరి మెదడు కణితి ఉన్నట్లు సంకేతం కావచ్చు. బ్రెయిన్ ట్యూమర్లు ఉన్నవారిలో 5 నుంచి 10 శాతం మంది జన్యుపరమైనవారు. ఒకే కుటుంబానికి చెందిన అనేక మంది సభ్యులకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, జన్యు రకాన్ని పంచుకునే కుటుంబ సభ్యులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఏది ఏమైనప్పటికీ, బ్రెయిన్ ట్యూమర్‌ల యొక్క ఏవైనా ప్రారంభ సంకేతాలు లేదా లక్షణాలను విస్మరించకుండా ఉండటం, వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యమన వైద్యులు చెప్తున్నారు