ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హాథ్రాస్‌లో(Hathras) తొక్కిసలాట(stampede) జరిగి 121 మంది మరణించిన విషయం తెలిసిందే!
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హాథ్రాస్‌లో(Hathras) తొక్కిసలాట(stampede) జరిగి 121 మంది మరణించిన విషయం తెలిసిందే! మతపరమైన సమావేశాలలో(Religious events) ఇలా తొక్కసలాటలు జరగడం, వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం మనం ఇంతకు ముందు కూడా చూశాం! భారత్‌లో ఇది కొత్త కాదు. ఇలాంటి విషాద ఘటనలు చాలానే జరిగాయి. మహారాష్ట్రలో 2005వ సంవత్సరంలో పెను విషాదం చోటు చేసుకుంది. వాయి పట్టణంలో ఉన్న మంధరాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 265 మందికి పైగా భక్తులు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. గుడికి వెళ్లే మెట్ల మార్గం జారుతుండటాన్ని భక్తులు గమనించలేదు. చాలా మంద జారి కిందపడ్డారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని(Himachal Pradesh) నైనా దేవి ఆలయంలో 2008 ఆగస్టు మాసంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 145 మంది భక్తులు చనిపోయారు. కొండ చరియలు విరిగిపడుతున్నాయన్న వార్త తెలియడంతో భక్తులు భయాందోళనలకు గురి అయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు తీశారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. అదే ఏడాది సెప్టెంబర్ మాసంలో రాజస్తాన్‌లోని చాముందగర్ ఆలయంలో పెను విషాదం సంభవించింది. నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. దుర్గా దేవిని పూజచేయడానికి తోసుకున్నారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 250 మంది చనిపోయారు. 2010 మార్చి నెలలో ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. వరదల కారణంగా చాలా మంది నిరాశ్రయులయ్యారు. తాగేందుకు నీరు లేక, తినేందుకు తిండి లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇదే సమయంలో ఓ గుడిలో ఆహారం, బట్టలు ఇస్తున్నారని ఎవరో చెప్పగా విని పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో 63 మంది చనిపోయారు. 2013 ఫిబ్రవరిలో కుంభమేళా జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ మహోత్సవానికి దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చారు. ఓ రోజున అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 36 మంది చనిపోయారు. చనిపోయినవారిలో 27 మంది మహిళలు ఉండటం విషాదం. అదే ఏడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని రత్నగఢ్ ఆలయంలో తొక్కిసలాట జరిగి 115 మంది చనిపోయారు. 2022 జనవరిలో జమ్ము కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12 మంది చనిపోయారు. ఆలయ ద్వారం చిన్నగా ఉన్న కారణంగానే తొక్కిసలాట జరిగింది. 2015 జూలై మాసంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ను ఎవరూ మర్చిపోలేరు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర్‌ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.