జమ్ము కశ్మీర్‌లో(Jammu Kashmir) వెలిసే అమర్‌నాథుడిని(Amarnath) దర్శించుకోవడానికి భక్తులు(Pilgrims) తండోపతండాలుగా వస్తున్నారు.
జమ్ము కశ్మీర్‌లో(Jammu Kashmir) వెలిసే అమర్‌నాథుడిని(Amarnath) దర్శించుకోవడానికి భక్తులు(Pilgrims) తండోపతండాలుగా వస్తున్నారు. మహాశివుని(Lord shiva) నామస్మరణతో కొండలు కోనలు ప్రతిధ్వనిస్తున్నాయి. రెండో రోజు ఆదివారం అయితే సుమారు 15 వేల మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకుని తన్మయులయ్యారు. మొదటి రెండు రోజుల్లో మొత్తం 28 వేల మంది అమరనాథుడిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే అమర్‌నాథ్ యాత్ర చేయడానికి తాజాగా పహల్‌గావ్, బాల్టల్‌ల నుంచి రెండవ బృందం బయల్దేరింది. మొత్తం 309 వాహనాలలో బాల్టన్ మార్గంలో 2,106 మంది పురుషులు, 11 మంది పిల్లలు, 115 మంది సాధువులు, 41 మంది సాధ్విలు యాత్రకు బయలుదేరారు. స్థానికులు భక్తులకు ఘన స్వాగతం పలికారు. యాత్ర విజయవంతం కావాలనికోరుకున్నారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్థానికులతో పాటు భక్తులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కన్నా ప్రస్తుతం ఏర్పాట్లు బాగున్నాయని 25వ సారి అమర్‌నాథ్ యాత్ర చేస్తున్న కృష్ణకుమార్ తెలిపారు.