అంతరించిపోయిందనుకున్న మశూచి(Small Pox) మళ్లీ విజృంభిస్తోంది. బీహార్‌లోని(Bihar) ఓ ఊళ్లో దాదాపు సగం జనానికి ఈ వ్యాధి సోకింది.. ఓ పక్క వడగాల్పులతో ఉక్కిరిబిక్కరి అవుతున్న ప్రజలకు స్మాల్‌ పాక్స్‌(Small Px) నరకం చూపిస్తోంది. మశూచి బారిన పడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం భయాందోళనను కలిగిస్తోంది. పాపౌల్‌(Popoul) జిల్లాలోని త్రివేణిగంజ్‌ గ్రామంలో ఇప్పటికే వంద మందికిపైగా స్మాల్‌ పాక్స్‌ సోకింది. కేవలం 35 కుటుంబాల నుంచే ఇంత మంది బాధితులు ఉండటం గమనించదగ్గ విషయం.

అంతరించిపోయిందనుకున్న మశూచి(Small Pox) మళ్లీ విజృంభిస్తోంది. బీహార్‌లోని(Bihar) ఓ ఊళ్లో దాదాపు సగం జనానికి ఈ వ్యాధి సోకింది.. ఓ పక్క వడగాల్పులతో ఉక్కిరిబిక్కరి అవుతున్న ప్రజలకు స్మాల్‌ పాక్స్‌(Small Px) నరకం చూపిస్తోంది. మశూచి బారిన పడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం భయాందోళనను కలిగిస్తోంది. సుపౌల్ (Supaul) జిల్లాలోని త్రివేణిగంజ్‌(Triveniganj) గ్రామంలో ఇప్పటికే వంద మందికిపైగా స్మాల్‌ పాక్స్‌ సోకింది. కేవలం 35 కుటుంబాల నుంచే ఇంత మంది బాధితులు ఉండటం గమనించదగ్గ విషయం. ఇందులో వైద్య అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. మూడు నెలల నుంచి మశూచి వ్యాధి ప్రబలుతున్నా వైద్య అధికారులు పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు. మశూచి వ్యాధిని గుర్తించిన తొలినాళ్లలోనే తాము వైద్య అధికారులకు ఫిర్యాదు చేశామని, వారు తమ మాటలను పట్టించుకోలేదని అంటున్నారు.

స్మాల్‌ పాక్స్‌ (Small Pox)బాగా వ్యాపించిన తర్వాత ఇప్పుడు హడావుడి చేస్తున్నారని బాధితులు చెప్పుకొచ్చారు. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి తమకు తోచిన వైద్యాన్ని చేసుకుంటున్నామని, డబ్బున్న వారు ప్రయివేటు ఆసుపత్రులకు వెళుతున్నారని తెలిపారు. ఇదిలాఉంటే మంగళవారం వైద్య అధికారులు నిద్రలేచి ఆ గ్రామాన్ని సందర్శించారు. వ్యాధి గ్రస్తులను గుర్తించామని, వారికి వైద్యం అందిస్తూనే , ఇతరులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. తమకు విషయం తెలియగానే ఆ గ్రామాన్ని సందర్శించామని జిల్లా వైద్య అధికారి మిహిర్ కుమార్ అంటున్నారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున స్మాల్ ఫాక్స్ సోకడానికి అనువైన వాతావరణం ఏర్పడిందని చెప్పారు. వేసవి తీవ్రత తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Updated On 22 Jun 2023 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story