ఉత్తర భారతదేశం సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు అతి త్వరలో వేడి నుండి ఉపశమనం పొందబోతున్నాయి. రాజధాని ఢిల్లీలో(Delhi) గతంలో కురిసిన వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా.. మరికొద్ది రోజుల్లో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారనుంది. ఐఎండీ(IMD) ఈ రోజు రుతుపవనాలకు(Monsoons) సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేసింది. వాతావరణ శాఖ (IMD) ప్రకారం..
ఉత్తర భారతదేశం సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు అతి త్వరలో వేడి నుండి ఉపశమనం పొందబోతున్నాయి. రాజధాని ఢిల్లీలో(Delhi) గతంలో కురిసిన వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా.. మరికొద్ది రోజుల్లో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారనుంది. ఐఎండీ(IMD) ఈ రోజు రుతుపవనాలకు(Monsoons) సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేసింది. వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. రుతుపవనాల ఆగమనం జూన్‌లో ఉంటుంది. రుతుపవనాలు జూన్ 4 నాటికి కేరళకు చేరుకుంటాయి. జూన్ 1లోపు రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం లేదని ఐఎండీ పేర్కొంది. వాతావరణ శాఖ ప్రకారం.. జూన్‌లో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాదారణ ఉష్ణోగ్రతలతో పాటు.. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వచ్చే నెలలో ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రారంభమవుతాయని ఐఎండీ అంచనా వేసింది.