ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని హాథ్రస్‌లో(Hathras) ఓ ఎఫ్‌సీఐ(FCI) గోదాంలో కోతుల మృతి కలకలం(Monkeys death) రేగింది.

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని హాథ్రస్‌లో(Hathras) ఓ ఎఫ్‌సీఐ(FCI) గోదాంలో కోతుల మృతి కలకలం(Monkeys death) రేగింది. ఓ ఆహార నిల్వల గోడౌన్లో పురుగుల మందు స్ప్రే చేయగా కిటికీ నుంచి లోపలికి వెళ్లిన 100కి పైగా కోతులు దాన్ని పీల్చడం వల్ల చనిపోయాయి. అయితే గోడౌన్ నిర్వాహకులు ఈ విషయం బయటపడకుండా, గుట్టుగా వాటన్నింటినీ ఓ గోతిలో ఖననం చేశారు. స్థానిక విశ్వహిందూ పరిషత్ నేతల ఫిర్యాదుతో, పోలీసులు కోతుల్ని వెలికి తీసి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక నేత హర్షిత్‌ గౌర్‌ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఈ విషయం బయటపడింది. తనకు తెలిసిన వ్యక్తి ఒకరు ఎఫ్‌సీఐ గోదాంలో పని చేస్తున్నారని, కోతులను పాతిపెట్టిన విషయం ఆ ఉద్యోగి వల్లే తనకు తెలిసిందని హర్షిత్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Eha Tv

Eha Tv

Next Story