సాధారణంగా కోతులను(Monkey) ప్రజలు హనుమంతుడిలా(Hanuman) భావిస్తారు. ఉత్తర భారత దేశంలో(North India) అయితే కోతులపై ఈ భక్తి మరీ ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం. దీంతో కోతులపై జనరల్‌గా ప్రజలు దాడులు చేయరు. కోతులపై దాడి చేస్తే హనుమంతుడిపై దాడులు చేసినట్లు..

సాధారణంగా కోతులను(Monkey) ప్రజలు హనుమంతుడిలా(Hanuman) భావిస్తారు. ఉత్తర భారత దేశంలో(North India) అయితే కోతులపై ఈ భక్తి మరీ ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం. దీంతో కోతులపై జనరల్‌గా ప్రజలు దాడులు చేయరు. కోతులపై దాడి చేస్తే హనుమంతుడిపై దాడులు చేసినట్లు.. ఆ పాపం తమకెందుకని కోతులను లైట్‌ తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ కోతులే ప్రజల ప్రాణాలను తీస్తున్నాయని.. కోతులను గ్రామం నుంచి తరలించాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నరు.

గుజరాత్‌లో(Gujarat) దారుణం జరిగింది. దేహగామ్‌ తాలుకా సల్కి(Salki) గ్రామంలోని ఆలయంలో చిన్నారులు ఆడుకుంటుండగా ఓ కోతి దాడి చేసింది. ఈ దాడిలో దీపక్‌ ఠాగూర్‌(Deepak Tagore) అనే 10 ఏళ్ల బాలుడు చనిపోయాడు. కోతి దాడిలో బాలుడి పేగులు బయటపడ్డాయి. దీంతో బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
కాగా ఈ గ్రామంలో కోతుల బెడద విపరీతంగా ఉందని.. ఈ కోతులు తరుచుగా గ్రామస్తులపై దాడులు చేస్తున్నాయిని స్థానికులు వాపోతున్నారు. ఈ వారంలోనే నాలుగైదు ఘటనలు జరిగాయని కోతులను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ కోతుల బెడదను నివారించేందకు ప్రయత్నిస్తున్నామని గ్రామంలో బోనులు ఏర్పాటు చేస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Updated On 14 Nov 2023 2:55 AM GMT
Ehatv

Ehatv

Next Story