కర్ణాటక అసెంబ్లీ ఫలితాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఎన్నికలలో హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్.. బీజేపీ అభ్యర్ధి మహేష్ తెంగినాకై చేతిలో దాదాపు 32,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫలితాల అనంతరం శెట్టర్ మాట్లాడుతూ.. తన ఓటమికి "ధనబలం" కారణమైందని పేర్కొన్నారు. జగదీష్ శెట్టర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో పార్టీ నుంచి వైదొలగారు.
కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఫలితాల(Election Results)లో కాంగ్రెస్(Congress) విజయం సాధించింది. ఈ ఎన్నికలలో హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్(Hubli Dharwad Central) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్(Jagadish Shettar).. బీజేపీ(BJP) అభ్యర్ధి మహేష్ తెంగినాకై(Mahesh Tenginkai ) చేతిలో దాదాపు 32,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫలితాల అనంతరం శెట్టర్ మాట్లాడుతూ.. తన ఓటమికి "ధనబలం" కారణమైందని పేర్కొన్నారు. జగదీష్ శెట్టర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో పార్టీ నుంచి వైదొలగారు.
శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగదీశ్ శెట్టర్.. తన ఓటమికి ధనబలం(Money Power) చాలా కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఓటర్లపై ఒత్తిడి కూడా తన ఓటమికి కారణమైందని అన్నారు. గత 6 ఎన్నికల్లో నేనెప్పుడూ ధనబలం ఉపయోగించలేదని.. ఓటర్లకు డబ్బు పంపిణీ చేయలేదని, ఓ బీజేపీ అభ్యర్థి ఓటర్లకు డబ్బులు పంచడం ఇదే తొలిసారి అని శెట్టర్ అన్నారు.
బీజేపీ ధనబలం వ్యూహం వల్లే తాను ఓడిపోయానని శెట్టర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వస్తుందని గత వారం రోజులుగా చెబుతున్నానని, ఉత్తర కర్ణాటకలో ఎక్కడ ప్రచారానికి వెళ్లినా కాంగ్రెస్ అభ్యర్థులందరూ గెలిచారని అన్నారు. ఇది మాత్రమే కాదు, నేను పర్యటించని ప్రాంతాల్లో కూడా లింగాయత్ వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
డబ్బు శక్తి దేనినైనా మార్చగలదని శెట్టర్ అన్నారు. డబ్బు శక్తి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. జగదీష్ శెట్టర్‌ను ఓడించడమే బీజేపీలో అందరి టార్గెట్ అని.. కానీ కర్ణాటకలో వారే ఓడిపోయారు. 65 సీట్లకు పడిపోయిందని అన్నారు. ఇది బీజేపీ రాష్ట్ర నేతలకే కాదు.. జాతీయ నాయకులకు కూడా పెద్ద దెబ్బ అని జగదీష్ షెట్టర్ అన్నారు.